Advertisementt

‘పుష్ప’ విషయంలో అస్సలు తగ్గడం లేదుగా..

Fri 08th May 2020 12:25 PM
allu arjun,pushpa,highlights,fighting,item song,bollywood  ‘పుష్ప’ విషయంలో అస్సలు తగ్గడం లేదుగా..
Pushpa update: 6 Crores for fight ‘పుష్ప’ విషయంలో అస్సలు తగ్గడం లేదుగా..
Advertisement
Ads by CJ

సుకుమార్ - బన్నీ కలయికలో పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా ఇంకా సెట్స్ మీదకెళ్ళలేదు కానీ... అప్పుడే సినిమాపై అంచనాలు పెరిగేలా భారీ న్యూస్ లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా బన్నీతో బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ ఐటెం సాంగ్ చేయబోతుంది అని.. పుష్పలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో ఓ లారీ ఛేజింగ్ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలవబోతుంది అని ప్రచారం జరుగుతుంది. ఆ సీన్ కూడా అడవి నేపథ్యంలోనే ఉండబోతుందట.

అయితే ఆ భారీ యాక్షన్ సన్నివేశం కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ ని సుకుమార్ దింపాలని చూసినప్పటికీ.. కరోనా అడ్డు పడడంతో.. బాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ తోనే పని కానిచ్చేస్తున్నారట. అయితే ఈ ఫైట్ సీన్ పుష్ప సినిమాలో 6 నిమిషాల పాటు వుంటుందట. ఈ 6 నిమిషాల ఫైట్ సీన్ కి గాను 6 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ రేంజ్ ఖర్చు ఆ సీన్ కి పెడుతున్నారంటే... సినిమాలో ఈ యాక్షన్ సీన్ ను ఏ రేంజ్ లో చిత్రీకరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు. ఇక సాంగ్స్ విషయంలోనూ సుకుమార్ ప్రత్యేకమైన సెట్స్ వెయ్యాలని... అవుట్ డోర్ షూటింగ్ ఎంతవరకు తగ్గించాలో అంతగా కుదించి.. సెట్స్ లోనే షూటింగ్ పనికానిచ్చెయ్యాలని ఆలోచిస్తున్నాడట.

Pushpa update: 6 Crores for fight :

Allu Arjun Pushpa Movie Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ