త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్‌కు పండగే. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వస్తే అందులో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. దాంతో నాలుగో సినిమా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. పైగా పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తరువాత సినిమాలు చేస్తున్నాడు కాబట్టి కచ్చితంగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ చేస్తున్నాడు అనుకున్నారంతా. అయితే ఫ్యాన్స్ కల నెరవేరబోతోంది. కాకపోతే త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ చేయడం లేదు.
ప్రస్తుతం పవన్ ‘వకీల్ సాబ్’ చేస్తున్నాడు. ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో ఒక భారీ చారిత్రక చిత్రాన్ని చేయనున్నాడు. లాక్ డౌన్ తరువాత క్రిష్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. ఇక ఆ తరువాత హరీష్ శంకర్ డైరెక్షన్ పవన్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలు తరువాత పవన్ ‘డాలీ’ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ కాంబినేషన్ లో గతంలో ‘గోపాల గోపాల’ వచ్చి హిట్ అందుకుంది. అయితే ఆ సినిమాకి డాలీ డైరెక్షన్ చేయాలనీ మాటలు, కథ త్రివిక్రమ్‌ను ఇవ్వమన్నట్టు పవన్ అడిగినట్టు సమాచారం. దాంతో ఆ ప్రాజెక్ట్ కి క్రేజ్ పెరిగే అవకాశం లేకపోలేదు.