Advertisementt

ప్రగతి ఆంటీని అంతగా ఇబ్బంది పెట్టిందెవరబ్బా!?

Wed 06th May 2020 05:44 PM
actress pragathi,pragathi aunty,jr artist pragathi,famous comedian,misbehave,tollywood  ప్రగతి ఆంటీని అంతగా ఇబ్బంది పెట్టిందెవరబ్బా!?
Actress Pragathi reveals that famous comedian misbehaved with her ప్రగతి ఆంటీని అంతగా ఇబ్బంది పెట్టిందెవరబ్బా!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న ప్రగతి ఆంటీ.. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదన్న విషయం అందరికీ తెలిసిందే. నటించేది ఆర్టిస్ట్‌గా అయినప్పటికీ తన అంద చెందాలతో కుర్రకారుకు మతిపోగొడుతోంది. సినిమాల్లో హీరోయిన్‌గా ఇప్పట్లో అవకాశం ఇవ్వట్లేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్లకు పోటీగా తన హాట్ హాట్ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో కుర్రకారు ఆమె ఫొటోలకు ఎగబడి మరీ పాలో అవుతూ.. తెగ కామెంట్స్ చేసేస్తుంటారు. అయితే.. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి.

అసలేం జరిగింది!?

అసలు విషయానికొస్తే.. తల్లి పాత్రలకే పరిమితం అయిన ఈ ఆంటీ తాజాగా తన కెరీర్‌లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ప్రస్తావనకు తెచ్చింది. ఓ స్టార్ కమెడియన్ కాంబినేషన్‌లో తాను కొన్ని సినిమాలు చేశానని.. ఆయన తనకు చాలా ఏళ్లుగా తెలుసని చెప్పింది. అయితే.. ఓ రోజు సినిమా సెట్‌లో తనతో తప్పుగా ప్రవర్తించడాడని అసభ్యంగా మాట్లాడుతూ తనను ఇబ్బంది పెట్టాడని చెప్పుకొచ్చింది. ఆయన ప్రవర్తన, మాట తీరును తాను అస్సలు జీర్ణించుకోలేకపోయానని.. షూటింగ్ అయ్యేంతవరకూ ఓపిక పట్టి ఆ తర్వాత సాయంత్రం ఇంటికెళ్లి కాల్ చేసి ఇలా చేయడం పద్ధతి కాదని.. మీ అసభ్య పదజాలాన్ని, ప్రవర్తనను సహించలేకపోయానని ఆయనతో చెప్పినట్లు ఇంటర్వ్యూలో ప్రగతి చెప్పుకొచ్చింది.

ఇంతకీ ఎవరబ్బా!?

సెట్‌లో తాను మీ గురించి మాట్లాడితే బాగోదని.. మీ ఇమేజ్ దెబ్బతింటుందనే ఇలా మాట్లాడుతున్నట్లు ఆ రోజు సాయంత్రం కాల్ చేసి ప్రశ్నించానని ప్రగతి తెలిపింది. తర్వాత కొన్నిరోజులు తర్వాత తనకు బాగా పొగరు అని ప్రచారం చేశాడని కూడా చెప్పింది. అయితే ఆ స్టార్ కమెడియన్.. స్టార్ అని పదే పదే చెబుతోందే తప్ప ఆయన పేరు చెప్పడానికి మాత్రం అస్సలు ఆమె సాహసించలేదు. దీంతో ఇంతకీ ఆ స్టార్ కమెడియన్ ఎవరబ్బా అని అందరూ ఆలోచనలో పడ్డారు. కొందరు బహుశా ఆయనే ఏమో.. ఆయనకు అసలే బలుపెక్కువ అని పేర్లు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొదరైతే ఇంకెవ్వరూ ఆ పొగరబోతు కమెడియనే అంటూ పేర్లు కామెంట్ల రూపంలో రాసి మరీ తిట్టిపోస్తున్నారు.

Actress Pragathi reveals that famous comedian misbehaved with her:

Actress Pragathi reveals that famous comedian misbehaved with her  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ