Advertisementt

మే 20న రాజమౌళి ఏం చేయబోతున్నాడు..?

Wed 06th May 2020 02:34 PM
ss rajamouli,jr ntr,may 20,rrr,special teaser,ram charan  మే 20న రాజమౌళి ఏం చేయబోతున్నాడు..?
RRR Movie jr ntr Special Teaser Update మే 20న రాజమౌళి ఏం చేయబోతున్నాడు..?
Advertisement
Ads by CJ

అన్ని అనుకున్నట్టే జరిగితే మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజున RRR నుండి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ కావాల్సివుంది. కానీ లాక్‌డౌన్ కారణంగా ఎన్టీఆర్ పుట్టినరోజు టీజర్ ఇప్పటిలో అసాధ్యమే అని తెలుస్తుంది. వాస్తవానికి మే 7న లాక్ డౌన్ ఎత్తివేస్తారు అనుకున్నారు. దాంతో రాజమౌళి కూడా టీజర్‌కు సంబంధించి పనులు చకచకా చేసేసి మే 20న రిలీజ్ చేయొచ్చు అనుకున్నాడు కానీ లాక్ డౌన్ 17 వరకు పొడిగించారు. ఇప్పుడు 29 వరకు అంటున్నారు.

లేటెస్ట్ గా జక్కన్న టీజర్ గురించి ఓ ఇంటర్వ్యూ లో... లాక్ డౌన్ మే 7న ఎత్తివేస్తే టీజర్ కు సంబంధించి కొంత షూట్ ఉంది అది కంప్లీట్ చేసి ఎన్టీఆర్ టీజర్ ను రిలీజ్ చేయొచ్చని లేకపోతే కష్టమేనని కూడా చెప్పాడు. సో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కాబట్టి ఈసారి ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఆర్ఆర్ఆర్ నుంచి టీజర్ వచ్చే ఛాన్స్ ప్రస్తుతానికైతే లేదు. కాకపోతే రాజమౌళి ఎట్టి పరిస్థితిల్లో ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు.

కానీ రాజమౌళి దగ్గర ఉంది ఒకటే ఆప్షన్. ఇప్పటికే అనుకున్న టీజర్ కాన్సెప్ట్ కు రిపేర్లు చేసి, ఉన్న ఫూటేజ్‌తో మరో కొత్త టీజర్ రెడీ చేయాలి. లేదంటే.. టోటల్ గా టీజర్ ఆలోచనను పక్కనపెట్టి మరో కొత్త మెటీరియల్ (పోస్టర్ లేదా మోషన్ పోస్టర్) తో రావాలి. చూడాలి ఏం జరుగుతుందో. ఏదిఏమైనా మరో నాలుగు రోజుల్లో టీజర్ గురించి క్లారిటీ రానుంది.

RRR Movie jr ntr Special Teaser Update:

Rajamouli plans for jr ntr special teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ