టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజీ మల్టీస్టారర్ అంటే RRR చిత్రమే. రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ లను హీరోలుగా పెట్టి రాజమౌళి భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు రాజమౌళిని చూసి ఓ చిన్న దర్శకుడు కూడా ఓ భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడట. స్వరూప్ అనే దర్శకుడు ఈ సాహసం చేయనున్నాడు. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమా దర్శకుడు ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ కొత్త డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ అని చెబుతున్నాడు. ‘ఎన్టీఆర్, బన్నీ ఎనర్జీ లెవెల్స్ దాదాపు ఒకే రేంజ్‌లో ఉంటాయి. నటనలో కానీ, నాట్యంలో కానీ ఇద్దరూ ఇద్దరే… ఈ ఇద్దరితో ఓ మల్టీస్టారర్ తీయాలనేది నా కోరిక..’ అంటూ స్వరూప్ చెప్పుకొచ్చాడు.
ఎన్టీఆర్ అయితే ఒప్పుకునే అవకాశం ఉందికాని అల్లు అర్జున్ ఒప్పుకోవడం కష్టమే. ఎందుకంటే బన్నీ గతంలో ‘వేదం’ సినిమాలో మంచు మనోజ్‌తో కలిసి నటించిన బన్నీ, అనుష్క ‘రుద్రమదేవీ’లోనూ స్పెషల్ రోల్ చేసి మెప్పించాడు. ఇక ఆ తరువాత స్టార్ డమ్ పెంచే సినిమాలు చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో బన్నీ సోలో ఇమేజ్ ను పెంచుకుని పాన్ ఇండియా మూవీస్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇటువంటి టైములో బన్నీ తారక్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటాడా అంటే కష్టమే అని తెలుస్తుంది. స్క్రిప్ట్ బాగా బలంగా ఉంటే తప్ప బన్నీ మల్టీ స్టారర్ ఆలోచించడు.