శేఖర్ కమ్ముల ఫిదా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కిస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ లేకపోతే.. లవ్ స్టోరీ ముచ్చట్లు ఈపాటికి సోషల్ మీడియాని షేక్ చేసేవే. లవ్ స్టోరీలో వదిలిన ఒకే ఒక్క సాంగ్ ట్రేండింగ్ లోకి రావడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర హైలెట్ అని.. నాగ చైతన్య ని డామినేట్ చెయ్యగా.. అది చూసిన చైతూ కొన్ని సీన్స్ ని శేఖర్ ఖమ్ములని మళ్లీ రీ షూట్ చెయ్యాలని అడిగినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మామూలుగానే సాయి పల్లవిపై వస్తున్న వార్తలకు ఈ న్యూస్ మ్యాచ్ అవడంతో అందరూ నిజమే అనుకున్నారు.
తాజాగా లవ్ స్టోరీ పై వస్తున్న ఆ వార్తలన్నీ పుకార్లే అని.. సినిమా అవుట్ ఫుట్ చాలాబాగా వచ్చింది అని... సాయి పల్లవి - నాగ చైతన్య పోటీపడి సినిమాలో నటించారని... చైతు కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యానని.. సినిమా సూపర్ హిట్ అంటుంది చిత్ర బృందం. శేఖర్ కమ్ముల స్టార్ డమ్, సాయి పల్లవి క్రేజ్, చైతు హిట్స్ మీదున్న క్రేజ్ తో లవ్ స్టోరీపై ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి ఉంది.