Advertisementt

నటనలో ఆయనే నాకు స్ఫూర్తి.. సందీప్ కిషన్..

Tue 05th May 2020 03:00 PM
sandeep kishan,fahad fajil,trance,lockdown celebrities  నటనలో ఆయనే నాకు స్ఫూర్తి.. సందీప్ కిషన్..
He is my inspiraation.. Said Sandeep Kishan నటనలో ఆయనే నాకు స్ఫూర్తి.. సందీప్ కిషన్..
Advertisement
Ads by CJ

హీరోగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సందీప్ కిషన్, ప్రస్తుతం చేస్తున్న ఏ౧ ఎక్స్ ప్రెస్ పై బాగా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా నుండి రిలీజైన పాటకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. హాకీ క్రీడా నేపథ్యంగా సాగే ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కనిపిస్తుంది. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న సందీప్ కిషన్ ఒకానొక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ఆసక్తికర సంఘటనలని పంచుకున్నాడు.

సినిమాల్లో హిట్లు లేక అవస్థలు పడుతున్న టైమ్ లో తన క్లోజ్ ఫ్రెండ్సే మోసం చేశారట. నిర్మాతగా మారి నిను వీడని నేనే సినిమాతో ఫర్వాలేదనిపించుకున్న తర్వాత కొంత స్థిమితపడ్డాడట. ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులవుతున్నా ఇంకా బ్యాచులర్ గా కొమసాగుతున్న సందీప్ కిషన్ ని రిలేషన్ షిప్ లో ఉన్నారా అన్న ప్రశ్నకి, గతంలో ఇద్దరితో రిలేషన్ షిప్ లో ఉన్నానని, ప్రస్తుతం దృష్టంతా సినిమా మీదే ఉందని బదులిచ్చాడు. 

లాక్డౌన్ టైమ్ లో ఏం చేస్తున్నారని అడిగితే, ఓటీటీలో వెబ్ సిరీస్ లు చూస్తూ కాలం గడుపుతున్నానని, ఈ మధ్య చూసిన సినిమాల్లో మళయాల చిత్రమైన ట్రాన్ బాగా నచ్చిందని పేర్కొన్నాడు. ఆ సినిమాలో హీరో ఫాహద్ ఫాజిల్ చాలా బాగా చేశాడని, నటనలో ఆయనే స్ఫూర్తిగా నిలుస్తున్నాడని తెలిపాడు.

He is my inspiraation.. Said Sandeep Kishan:

FahadFazil is My Inspiration said Sandeep Kishan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ