Advertisementt

నేనింకా చిన్నపిల్లాడినే: విజయ్ దేవరకొండ

Tue 05th May 2020 01:27 PM
vijay deverakonda,marriage,bollywood media,kid,no mature  నేనింకా చిన్నపిల్లాడినే: విజయ్ దేవరకొండ
Vijay Deverakonda Response on Marriage నేనింకా చిన్నపిల్లాడినే: విజయ్ దేవరకొండ
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో పెళ్లికాని హీరోలు చాలామందే ఉన్నారు. అయితే తాజాగా స్టార్ లిస్ట్‌లో కొచ్చిన విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చే అమ్మాయిలు, హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. విజయ్‌తో సినిమాకోసం హీరోయిన్స్ వేచి చూస్తుంటే.... విజయ్‌తో ఒక్కసారి మాట్లాడాలని చాలామంది అమ్మాయిలు తహతహలాడుతున్నారు. అయితే విజయ్ దేవరకొండ సినిమాల్లో రొమాంటిక్ హీరోనే. అలాగే మొన్నామధ్యన విజయ్ దేవరకొండ ఎవరో అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే ప్రేమా లేదు దోమా లేదు.. నాకప్పుడే పెళ్లింటి అన్నాడు.

తాజాగా కరోనా లాక్ డౌన్ తో ఉద్యోగాలు కోల్పోతున్న మిడిల్ క్లాస్ యువతకు ఉద్యోగ కల్పనకోసం ఓ చారిటి ఏర్పాటు చేసిన విజయ్ దేవరకొండని ఫైటర్ సినిమాతో బాలీవుడ్ కి అడుగుపెడుతుండడంతో బాలీవుడ్ మీడియా విజయ్ దేవరకొండని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. అందులో భాగముగా విజయ్ మీ పెళ్ళెప్పుడు అని అడగగా.. నన్ను పెళ్లి చేసుకోమని అమ్మ అడుగుతుంది. నాకు ఫ్యామిలీ, కుటుంబ జీవితం అంటే చాలా ఇష్టం. పెళ్లి పిల్లలు అనేది చాలా బావుంటుంది. కానీ దానికి ఓ సమయం ఉంది. పెళ్లి లైఫ్ లోకి అడుగుపెట్టాలంటే మానసికంగా సిద్ధమవ్వాలి. కానీ నేను మానసికంగా పరిణీతి చెందలేదు. నేనింకా చిన్నపిల్లాడిని. పెళ్లి చేసుకున్నాక ఆ బంధానికి ప్రాముఖ్యత ఇవ్వాలి.. అన్ని విషయాలు లైఫ్ పార్టనర్ తో షేర్ చేసుకోవాలి. అదే పెళ్లి చేసుకోకుండా ఉంటే నచ్చిన లైఫ్ ఉంటుంది. ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు అంటున్నాడు ఈ యంగ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.

Vijay Deverakonda Response on Marriage:

I am not Ready to Marriage says Vijay deverakonda

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ