సేవ చేయడానికి డబ్బు కంటే ముఖ్యంగా మనస్సుండాలి. డబ్బుతో తనకు ఒనగూరే సుఖాలను-ప్రయోజనాలను త్యాగం చేసే గుణం ఉండాలి. అవి పుష్కలంగా ఉండడం వల్లే.. కరోనా కారణంగా తిండికి కటకటలాడుతున్న అభాగ్యులకు... తన తాహతుకు మించి, తన వంతు సాయం అందిస్తున్నాడు వర్ధమాన కథానాయకుడు రాజ్ బాల. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి.. తనకు తెలిసినవాళ్ళలో.. కష్టాల్లో ఉన్నవారికి తోచినంత ఆర్ధిక సాయం అందిస్తున్న రాజ్ బాల తాజాగా లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో వెయ్యి రూపాయలు విలువ చేసే వంట సామగ్రిని 30 కుటుంబాలకు అందించాడు.
సినిమా కష్టాలన్నీఅనుభవిస్తూ.. అనేక చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి తన ప్రతిభను నిరూపించుకున్న రాజ్ బాల.. వెన్నెల కిషోర్ హీరోగా నటించిన ‘డాటారఫ్ వర్మ’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుని.. ‘లవ్ బూమ్, 7 టు 4’ చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. పాయల్ రాజ్ పుత్ నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ‘5 Ws’ లో మంచి పాత్ర చేసిన రాజ్ బాల హీరోగా నటించిన ‘చిత్రం X, మిస్టర్ క్యూ’ విడుదలకు సిద్దంగా ఉన్నాయి. రాజ్ బాల స్వగ్రామం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు సమీపంలోని ‘యడవల్లి’. సొంత జిల్లాతోపాటు.. రాజ్ బాలకు ప్రత్యేక అనుబంధం కలిగిన కర్నూలులోనూ.. ‘రాజ్ బాల యూత్’ పేరుతో.. కరోనా సందర్భంగా అతని ఫ్యాన్స్ తమవంతు సేవలందిస్తూ శభాష్ అనిపించుకుంటుండడం గమనార్హం- ప్రశంసార్హం.