లోకనాయకుడు కమల్ హాసన్ మరుదనాయగం సినిమాని మొదలు పెట్టి బడ్జెట్ కారణాల వల్ల అపేశాడు. అప్పట్లో ఈ సినిమా ప్రారంభోత్సవానికి క్వీన్ ఎలిజబెత్ 2 ని అతిధిగా పిలిచాడు. దాంతో ఈ సినిమాపై అందరికీ ఆసక్తి కలిగింది. అయితే మరుదనాయగం సినిమాకి అప్పట్లోనే వందకోట్ల వరకి బెడ్జెట్ అనుకోవడంతో అంత డబ్బు పెట్టే వాళ్ళు లేక, సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్లీ సినిమాని తీస్తానంటూ చెప్పినప్పటికీ, ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదు.
తాజాగా లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న కమల్ హాసన్ తమిళ నటుడు విజయ్ సేతుపతితో ముచ్చటించాడు. అప్పుడు విజయ్ సేతుపతి మరుదనాయగం సినిమా ఉంటుందా అని అడగడంతో కమల్ హాసన్ ఈ విధంగా సమాధానమిచ్చాడు. మరుదనాయగం సినిమాని 40ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు కథగా రాసుకున్నాను. నలభై ఏళ్ల హీరోనే ఆ సినిమా చేయాలి. నేను చేయాలంటే మాత్రం కథలో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. అందుకని ఆ సినిమా ఉండదని కన్ఫర్మ్ చేశాడు.