టాలీవుడ్‌లో ఈ మధ్య దర్శకుల నోట మల్టీస్టారర్ మూవీస్ అనే మాట.. గాసిప్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఆ మల్టీస్టారర్‌లో ఒకరు మాత్రం టాలీవుడ్ నుంచి కాగా మరొకరు బాలీవుడ్ నుంచి కావడం కాస్త అత్యాశ.. అస్సలు జరిగే పని కాదని ఇట్టే అర్థమైపోతోంది. వాస్తవానికి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం విలన్ మొదలుకుని సెకండ్ హీరోగా చేయాలన్నా వారికి ఎలాంటి మొహమాటాలుండవ్.. ఓన్లీ మూవీ పరంగా మాత్రమే చూస్తారంతే. కథలో దమ్ముంటే చాలు నటించడానికి నో చెప్పరంతే.
అంత సులువుగా అవుద్దా..!
ఇటీవల ప్రభాస్-అమీర్ ఖాన్‌తో కలిసి భారీ మల్టీస్టారర్ తెరకెక్కించాలని ఉందని ‘ఏజెంట్ సాయి శ్రీనివాస’ డైరెక్టర్ స్వరూప్. ఆశ పడటంలో, మనసులోని మాట చెప్పడంలో ఎలాంటి తప్పులేదు కానీ అంత దమ్మున్న కథ రాయడం.. వారిరివుర్నీ మెప్పించడం అంటే మామూలు విషయం కాదు.. అంత సులువుగా అయ్యే పనే కాదు. కాంబో మాత్రం అదుర్స్ ఇందులో వంకలు పెట్టడానికి లేదు. మరి కథ అదే రేంజ్‌లో ఉంటే ఇక స్వరూప్ హిస్టరీ రిపీట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే అలాంటి కథ తనదగ్గరుందని ఆయన ధీమా వ్యక్తం చేయడం నిజంగా గ్రేట్. మరి ఇది ఎప్పుడు ఆచరణలోకి వచ్చి ఇరువురికీ కథ చెప్పి మెప్పించి పట్టాలెక్కిస్తాడో అన్నది పైనున్న ఆ పెరుమాళ్లకే ఎరుక.
చిరుతో సల్మాన్ కథ కొస్తే..
ఇది ఏ మాత్రం నిజం కాదు.. కానీ పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయ్. వాస్తవానికి చిరుతో స్క్రీన్ పంచుకోవడానికి బాలీవుడ్ మొదలుకుని కోలీవుడ్.. ఇంకా ఇలా చెప్పుకుంటూ చాలా వుడ్‌ల హీరోయిన్లు, స్టార్ హీరోలు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అవకాశం వస్తే చాలు నటించడానికి హైదరాబాద్‌లో దూకేస్తారంతే. ‘ఆచార్య’ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ మూవీలో చిరు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే.. ఇందులో చిరుకు సపోర్టుగా బాలీవుడ్ కండలవీరుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనతో గెస్ట్ రోల్ చేపించాలని భావిస్తున్నారట.
వర్కవుట్ అయ్యేనా!?
వాస్తవానికి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లాంటి వారే చిరు సరసన నటించారు. ఆయనతో సినిమా అంటే పైసా కూడా పారితోషికం తీసుకోకుండా నటించారు కూడా. అలాంటిది సల్మాన్ మాత్రం అస్సలు ఒప్పుకోకుండా పోయే ఛాన్సే లేదు. సో.. ఇప్పటికే చిరుకు సపోర్టుగా పవన్ కల్యాణ్ అని.. బన్నీ అని ఇలా చాలా పేర్లే తెరపైకి వస్తున్నాయ్. మొత్తానికి చూస్తే ఇద్దరు ఖాన్‌ల పేర్లు మాత్రం గత వారం రోజులుగా టాలీవుడ్‌లో మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయ్. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుద్దో.. కథలతో ఖాన్ ద్వయాన్ని మెప్పించి పట్టుకొస్తారో లేకుంటా ‘సారీ’ అనే చెప్పించుకుని సైలెంట్‌గా ఉండిపోతారో జస్ట్ వెయిట్ అండ్ సీ.