Advertisementt

‘పుష్ప’ కోసం భారీ బడ్జెట్‌తో యాక్షన్ సీన్!

Mon 04th May 2020 06:36 PM
huge budget,bunny pushpa,action scene,allu arjun,sukumar  ‘పుష్ప’ కోసం భారీ బడ్జెట్‌తో యాక్షన్ సీన్!
Huge budget For Bunny Pushpa Action Scene! ‘పుష్ప’ కోసం భారీ బడ్జెట్‌తో యాక్షన్ సీన్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అలియాస్ బన్నీ, రష్మిక మందన్నా నటీనటులుగా హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఇందుకు సంబంధించి ఇప్పటికే చాలా అప్డేట్స్ వచ్చేశాయ్. బన్నీ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు కావాల్సిన అప్డేట్స్ అన్నీ చిత్రబృందం ఇచ్చేసింది. కరోనా మహమ్మారి దెబ్బతో యావత్ ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ కానీ.. షూటింగ్ కానీ లేకుండా పోయింది. ఈ దెబ్బ ‘పుష్ప’పై కూడా పడింది. ఈ వైరస్సే లేకుండా ఉండుంటే ఈ టైమ్‌కు సినిమా సగానికి పైగా అయిపోయేదేమో. ప్రస్తుతం షూటింగ్ లేకపోవడంతో సినిమాపై మాత్రం పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

ఇప్పటికే.. సెకండ్ హీరోయిన్‌పై చిత్రబృందం ఫుల్ క్లారిటీ ఇచ్చేయగా తాజాగా.. మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వెలుగులోకి వచ్చింది. ‘పాన్ ఇండియా’ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అంతే రీతిలో అన్నీ హంగులు చేయాల్సి ఉంటుంది. యాక్షన్ మొదలుకుని ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్ అన్నీ అదుర్స్ అనిపిస్తేనే అన్ని భాషల్లో జనాలు ఆదరిస్తారు. లేకుంటే అంతే సంగతులు. అందుకే అన్ని విషయాల్లో దర్శకనిర్మాతలు ఆచితూచి అడుగులేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో భారీ యాక్షన్ సీన్‌ను పెట్టాలని సుక్కు అనుకున్నాడట. ఇందుకు హాలీవుడ్ నుంచి ఫైట్ మాస్టర్లను రప్పించాలని అనుకున్నప్పటికీ కరోనా ఉధృతి తగ్గినా ఇది అస్సలు జరిగే పనికాదు. 

అందుకే.. పీటర్ హెయిన్స్‌, కనల్ కన్నణ్‌లను తీసుకొని వారితోనే ఈ భారీ యాక్షన్‌ సీన్స్‌ను కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. ఇందుకుగాను మొత్తం రూ. 6 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క ఫైట్‌కే ఇంత మొత్తంలో అంటే భారీ బడ్జెట్టే. పాన్ ఇండియా కాబట్టి మైత్రీ మూవీ మేకర్స్ అస్సలు తగ్గట్లేదట. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుద్దో.. అసలు ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు.

Huge budget For Bunny Pushpa Action Scene!:

Huge budget For Bunny Pushpa Action Scene!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ