Advertisementt

అవును.. నేను ఆగలేకపోతున్నా..: నిహారిక

Mon 04th May 2020 01:30 PM
niharika,niharika konidela,oh my kadavule,ashok selvan,tollywood  అవును.. నేను ఆగలేకపోతున్నా..: నిహారిక
Yes I Wont Stop Says Niharika Konidela..! అవును.. నేను ఆగలేకపోతున్నా..: నిహారిక
Advertisement
Ads by CJ

మెగా డాటర్ నిహారికకు సినిమాలు అస్సలు అచ్చి రావట్లేదు కానీ వెబ్ సిరీస్‌తో మాత్రం పర్లేదు అనిపించుకుంటోంది. ఎంతసేపు బుల్లితెర, వెబ్ సిరీస్‌పైనే మ్యాజిక్ చేసిన ఈ భామ ఆ మ్యాజిక్ మూవీస్‌లో మాత్రం వర్కవుట్ అవ్వలేదు. ఒకట్రెండు సినిమాల్లో పాత్ర పర్లేదు అనిపించినప్పటికీ సినిమా మాత్రం అట్టర్ ప్లాప్ అవ్వడంతో స్వస్తి చెప్పేసి వెబ్ సిరీస్‌లోకి దూకేసింది. ఇప్పటికే ‘ముద్దపప్పు ఆవకాయ్’, ‘నాన్న కూచి’ అనే వెబ్ సిరీస్‌లతో సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా ఓ వెబ్ సిరిస్ చేస్తోంది. అయితే తాజాగా తమిళ మీడియాలో వచ్చిన ఓ కథనానికి నిహారిక సెటైరేసిందో.. లేకుంటే కన్ఫామ్ చేసిందో ఆమెకు తెలియాలి.

ఇదీ అసలు కథ..!

అశోక్‌సెల్వన్‌, రితికా సింగ్‌, వాణి భోజన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన రొమాంటిక్‌ చిత్రం ‘ఓ మై కడవులే’. ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన ఈ చిత్రానికి యూత్‌ నుంచి మంచి స్పందన లభించింది. అయితే ఈ సినిమా తెలుగులో రాబోతోందని.. అదే హీరోనే ఇక్కడ కూడా నటిస్తాడని అయితే.. ఇందులో హీరోయిన్‌గా నిహారిక నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వార్తలను తమిళ వెబ్ సైట్లు తెగ రాసేస్తున్నాయి. అయితే దీనిపై నిహారిక సోషల్ మీడియా వేదికగా తాజాగా స్పందిస్తూ.. ‘అవునవును.. నా నెక్స్ట్ మూవీ అశోక్ సెల్వన్‌తో.. ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా.. షూటింగ్ ఎప్పుడా? అని ఆగలేకపోతోన్నాను’ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఆ వార్తల తాలుకూ స్క్రీన్ షాట్లను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అయితే కన్ఫామ్ చేసిందా..? లేకుంటే ఎటకారంగా మాట్లాడిందా అనేది మాత్రం తెలియరాలేదు.

Yes I Wont Stop Says Niharika Konidela..!:

Yes I Wont Stop Says Niharika Konidela..!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ