Advertisementt

30మినిట్స్ చాలు.. అదేపనిగా పత్యాపారం చేస్తే..!?

Mon 04th May 2020 09:49 AM
madhavi latha,actress madhavi,bjp,30 minutes,social media,face book  30మినిట్స్ చాలు.. అదేపనిగా పత్యాపారం చేస్తే..!?
Madhavi latha Comments On 30 Minutes Over..! 30మినిట్స్ చాలు.. అదేపనిగా పత్యాపారం చేస్తే..!?
Advertisement

టాలీవుడ్‌లో అప్పుడెప్పుడో ‘నచ్చావులే’ సినిమాలో నటించి.. ‘స్నేహితుడా’తో ప్రేక్షకులతో పర్వాలేదనిపించుకున్న నటి మాధవీలత. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రాకపోవడం.. తెలుగు సినిమాలకు విరామం ఇచ్చిన ఈ భామ 2019 ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకుంది. అంతేకాదు.. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే డిపాజిట్లు కూడా కరువయ్యాయి. అటు సినిమాల్లో ఫెయిల్.. ఇటు రాజకీయాల్లో అట్టర్ ఫెయిల్ అవ్వడంతో ఈ భామ మీడియా ముందుకు రావడం బొత్తిగా మానేసింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు, కార్యకర్తలతో టచ్‌లో ఉంటూ వస్తోంది.

ఈ మధ్యే.. తన అనారోగ్యం గురించి చెబుతూ మదనపడ్డ ఈ భామ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసి అందర్నీ ఆలోచనలోపడేసింది. సోషల్ మీడియాను సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ తెగ వాడేస్తున్నారు. ఇందులో మంచి గురించి వాడే వారు అతి తక్కువ మంది అయితే.. చెడు కోసం వాడి చిక్కుల్లో పడిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే అలాంటి వారిపై విసుగెత్తిన మాధవీలత ఓ సుధీర్ఘ వ్యాసం రేంజ్‌లో తన ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకొచ్చింది. ఆమె రాసిన పోస్ట్ యథావిధిగా ఇప్పుడు చూద్దాం.

కళ్లు దొబ్బుతాయ్ జాగ్రత్త..

‘సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాడటంలో తప్పు లేదు. మన భావాలు వ్యక్తపరచడం లో తప్పు లేదు వేరే వారి సందేశాలు చూడటంలో తప్పు లేదు కేవలం ఒక 30 నిముషాలు చాలు. అదే పనిగా ఇంకా పనేమీ లేనట్లు పత్యపారం చేస్తే వచ్చే సుJమేమో కానీ కళ్లు దొబ్బుతాయి. కనపడక కళ్లజోళ్లు ఎట్టుకోవాలి.. లేనిపోని మాయరోగాలు వస్తాయి మెదడు దెబ్బతింటుంది. ఇదే మంచి సమయం నేనేంటి?.. నేనెవరు నా గమ్యం ఏమిటి అసలు ఎందుకు మనం బతుకుతున్నాం? సాధించేవి ఏమిటి?.. ఇన్నాళ్లు ఎలా బతికాం? ఏం సాధించాం..?. డబ్బు ఒకటే జీవితమా? ఆద్యాత్మికం ఆంతర్యం మంచి విషయాల పైన విశ్లేషణ ఎంత గొప్పగా ఆలోచిస్తే మన మనసు బాగుంటుంది. ఎలాంటి ఆలోచన చేస్తే నిర్మలంగా ఉంటుంది..? మాట తీరు ఎలా ఉంటే బాగుంటుంది..?’ అనేది ఆలోచించాలని మాధవీ చెప్పింది.

వారి గురించి ఆలోచన వద్దు!

అలాగే నీలో నువ్వు నీతో నువ్వు మాట్లాడుకుని ఎన్నాళ్ళయింది..? ఒంటరిగా మాట్లాడాము నీ శరీరానికి ఏం కావాలి.. నువ్వేం ఇస్తున్నావ్.. ఇలాంటివి ఎన్నో చేయొచ్చు. నా పాటికి నేనెపుడు రోజుకి 30 నిముషాలు ఫేస్‌బుక్ అంతే. ఎపుడైనా లైవ్ ఉంటే కాస్త ఎక్కువ సమయం. నీతో నువ్వు ఒంటరిగా ఎక్కువగా గడపగలిగే అద్భుత అవకాశం ఇదే మళ్ళీ జీవితంలో రాదేమో. మనం చేసిన తప్పులు.. మనం చేసిన ఒప్పులు అన్ని సరిచూసుకుని తప్పులుంటే ఇంకెప్పుడు వారి గురించి ఆలోచన చేయొద్దు.. ఎందుకంటే ఎంత ఎక్కువగా తప్పుల గురించి ఆలోచిస్తే మెదడు శరీరం శక్తిని కోల్పోతుంది.. పవర్ అఫ్ స్పోకెన్. మనతో మనం అందంగా ఆనందంగా.. ఆలోచించుకుంటూ నేను బాగున్నాను బాగుంటాను. అందరు బాగుంటారు బాగుండాలి. మంచి మాటనే మాట్లడడం ఇలాంటివి. ప్రాక్టీస్ చేస్తే అద్భుతాల్ని మనమే చూడొచ్చు. ఇది కచ్చితంగా జరుగుతుంది. కలలు కనండి కలల్ని కలకంటూనే నిజం చేసుకోవాలి. పంచభూతాలు సహకరిస్తాయి అని పెద్ద పెద్ద విషయాలే మాధవీలత చెప్పుకొచ్చింది. 

Madhavi latha Comments On 30 Minutes Over..!:

Madhavi latha Comments On 30 Minutes Over..!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement