Advertisementt

‘ఆచార్య’ నుంచి తప్పుకోలే.. అడ్వాన్స్ తీసుకున్నాగా!

Sun 03rd May 2020 11:46 PM
acharya movie,chiranjeevi,megastar chiru movie,kajal,kajal agarwal  ‘ఆచార్య’ నుంచి తప్పుకోలే.. అడ్వాన్స్ తీసుకున్నాగా!
No Iam Doing Acharya Movie says Kajal! ‘ఆచార్య’ నుంచి తప్పుకోలే.. అడ్వాన్స్ తీసుకున్నాగా!
Advertisement

అందాల భామ కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌కు టాటా చెప్పేసి ఈ మధ్య అన్నీ కోలీవుడ్ సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని.. మెగాస్టార్ చిరంజీవి-హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘ఆచార్య’ మూవీ నుంచి కూడా తప్పుకుందని వార్తలు వినిపించాయి. అంతేకాదు.. గతంలో తమిళ్ కమ్ తెలుగులో విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘తుపాకి’ సీక్వెల్ మూవీతో పాటు.. మరో భారీ ప్రాజెక్ట్‌ ఉదయనిధి స్టాలిన్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని పుకార్లు షికార్లు చేశాయ్. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు అడ్వాన్స్ తీసేసుకుందని అందుకే ‘ఆచార్య’ నుంచి తప్పుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై తాజాగా ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

వెయిటింగ్..!

‘అబ్బే.. ఆచార్య నుంచి కాజల్ తప్పుకోలేదు. ఆ వార్తల్లో వాస్తవం లేదు.. ఎవరూ నమ్మకండి. కచ్చితంగా ఆ సినిమాలో చేస్తుంది. చేతిలో ఎన్ని సినిమాలున్నా సరే చిరు చిత్రానికే కాజల్ మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ చిత్రం బల్క్‌గా డేట్స్ కూడా ఇచ్చేసింది. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలువుతుందా అని కాజల్ వేచి చూస్తోంది. పరిస్థితులు అన్నీ చక్కబడ్డాకా షూటింగ్‌కు వస్తుంది’ అని కాజల్ బృందం క్లారిటీ ఇచ్చుకుంది. దీంతో పుకార్లకు చెక్ పెట్టినట్లయ్యింది.

పాత రోజులొచ్చేనా!?

ఒకవేళ తమిళ్‌లో ఇంకా సినిమాలు చేసినప్పటికీ ‘ఆచార్య’కే ఈ భామ మొదటి ప్రాధాన్యత ఇస్తుండటం మంచి పరిణామమే. కాగా.. ‘భారతీయుడు-02’లో కాజల్ నటిస్తోంది. సెట్స్‌లో ప్రమాదం జరిగిన తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కరోనా మహమ్మారి విస్తరించడంతో లాక్ డౌన్ విధించడం జరిగింది. దీంతో షూటింగ్‌లు సర్వం ఆగిపోయాయి. అంటే తమిళ్‌లో కాజల్ నటించేది నిజమే అయితే.. ‘భారతీయుడు’తో పాటు విజయ్, ఉదయ్ నిధి స్టాలిన్‌తో సినిమాలు అంటే వరుసగా మూడు సినిమాలు ఉంటాయన్న మాట. ఇటేమో మెగాస్టార్‌తో సినిమా .. మొత్తానికి చూస్తే పక్కాగా కాజల్‌కు పాత రోజులొచ్చేస్తాయన్న మాట.

No Iam Doing Acharya Movie says Kajal!:

No Iam Doing Acharya Movie says Kajal!  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement