విజయ్ దేవరకొండ రెండు వరస ప్లాప్స్‌తో స్పీడ్ కాస్త తగ్గించాడు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల ప్లాప్‌కి ముందు విజయ్ దేవరకొండ వరసగా సినిమాలు చేస్తాడని అన్నాడు. కానీ రెండు ప్లాప్స్ తర్వాత సైలెంట్‌గా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఫైటర్(వర్కింగ్ టైటిల్) సినిమాని పాన్ ఇండియా ఫిలింగా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత విజయ్ సినిమాల సంగతి ఎక్కడ కనబడలేదు వినబడలేదు. ఫైటర్ కన్నా ముందే శివ నిర్వాణ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో సినిమా ఉంటుంది అన్న విజయ్ తర్వాత కామ్ అయ్యాడు.
అయితే తాజాగా కరోనా లాక్ డౌన్ తో ఖాళీగా ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా తన నెక్స్ట్ సినిమాల వివరాలు చెప్పాడు. అందరూ అనుకున్నట్టుగా శివ నిర్వాణతో తన సినిమా ఆగలేదు ఉంటుంది అని.. అది కూడా ఫైటర్ తర్వాత అంటున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్‌లో ఉందని చెప్పకనే చెప్పేసాడు. దిల్ రాజు బ్యానర్ లో ఎప్పటినుండో సినిమా చేయాలనుకుంటున్నా అని.. అది శివ నిర్వాణ సినిమా తర్వాత ఉంటుంది అని.. దాని కోసం ఇప్పటికే కథ, దర్శకడు ఫైనల్ అయ్యాయని చెప్పిన విజయ్ దేవరకొండ ఆ సినిమాకి దర్శకుడెవరనేది రివీల్ చెయ్యలేదు. అది అప్పుడే చెబితే థ్రిల్ ఏముంటుంది అని సస్పెన్స్ లో పెట్టేసాడు. సో ఫైటర్ తర్వాత విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అవన్నమాట.