Advertisementt

సమంత ఆమెకి అంతగా నచ్చిందా..?

Sun 03rd May 2020 04:19 PM
samantha,rashi khanna,oh baby,lockdown celebrities   సమంత ఆమెకి అంతగా నచ్చిందా..?
Rashi khannas Favourite heroine is సమంత ఆమెకి అంతగా నచ్చిందా..?
Advertisement
Ads by CJ

ఏ మాయ చేశావే సినిమాతో అందర్నీ మాయ చేసిన సమంత తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నాగచైతన్యని పెళ్ళి చేసుకుని తెలుగింటి కోడలైన సమంతకి వరుస విజయాలు వచ్చాయి. ఆమె చేసిన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ఓ బేబీ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సమంత రేంజ్ ఓ మిడ్ రేంజ్ హీరో మాదిరి కంటే ఎక్కువే ఉన్నదని ఒప్పుకోక తప్పదు.

అంతటి రేంజ్ ఉన్న సమంత అంటే, తన పోటీ హీరోయిన్లకి ఈర్ష్య ఉండటం సహజమే. కానీ ఇండస్ట్రీలో వాటినెప్పుడూ బయటపడనివ్వరు. అయితే ఆ హీరోయిన్స్ గురించి అడిగినప్పుడు మాత్రం సమాధానం దాటవేస్తుంటారు. కానీ రాశీఖన్నా అలా చేయలేదు. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న రాశీ, సొషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. దాన్లో భాగంగానే తన ఫేవరేట్ హీరోయిన్ ఎవరని అడగ్గానే సమంత అని రిప్లై ఇచ్చింది.

సాధారణంగా ఇండస్ట్రీలో పోటీగా ఉన్న వారిని ఫేవరేట్ గా చెప్పడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకని పొరుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న తమకి పోటీకాని  పేర్లని చెబుతుంటారు. తమ ఇండస్ట్రీలోని పేర్లని చెబితే ఎక్కడ తమని తగ్గించుకున్నట్టు అవుతుందన్న సందేహంతో వాటికి సమాధానం ఇవ్వరు. కానీ రాశీఖన్నా సమాధానం చాలా జెన్యూన్ గా చెప్పినట్టు అనిపిస్తుంది. 

Rashi khannas Favourite heroine is:

Rashi khannas favourite heroine is

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ