Advertisementt

సమంత నెక్స్ట్ సినిమా ఫిక్సయిందా..!

Sun 03rd May 2020 11:41 PM
samantha,next film,sony pictures,lady oriented film,heroine samantha  సమంత నెక్స్ట్ సినిమా ఫిక్సయిందా..!
Samantha next Film Confirmed సమంత నెక్స్ట్ సినిమా ఫిక్సయిందా..!
Advertisement
Ads by CJ

సమంత తెలుగులో ‘జాను’ సినిమా తర్వాత మరే ఇతర తెలుగు సినిమా ఒప్పుకోలేదు. కారణాలు తెలియదు కానీ.. సమంత తాజాగా నటిస్తున్న తమిళ సినిమా నుండి కూడా తప్పుకుంది అనే న్యూస్ ప్రచారంలోకొచ్చింది. ఆ విషయంపై స్పష్టత లేకపోయినా.. సమంత ఎందుకో సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఆ మధ్యన నందిని రెడ్డి తో సినిమా అన్నప్పటికీ.... నందిని రెడ్డి సమంత తో నేను సినిమా చెయ్యడం లేదని చెప్పింది. అలాగే కన్నడలో హిట్ అయిన దియా సినిమాని సమంత రీమేక్ చేస్తుంది అనే టాక్ ఉంది.

 

కరోనా లాక్ డౌన్ తో చైతు తో కలిసి సమయాన్ని గడుపుతున్న సమంత ఓ సినిమా చెయ్యబోతుందట. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చ‌ర్స్ తెలుగులో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీని ప్లాన్ చేస్తుందట. దానికోసం సమంతని ఒప్పించడానికి సోనీ పిక్చర్స్ రంగంలోకి దిగిందట. ఇప్పటికే అన్ని పనులు చక్కబెట్టిందట. అంతేకాకుండా ఈ సినిమాని తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం ఓ కొత్త దర్శకుడిని తీస్కోబోతున్నట్లుగా సమాచారం. ఇక లాక్ డౌన్ ముందే సమంత తో సోని పిక్చర్ ఒప్పందం చేసుకుని.. పనులన్నీ ముగించింది. లాక్ డౌన్ ముగియగానే.. ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమట. షూటింగ్ ఎప్పుడు మొద‌లైనా స‌రే, సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమాని పూర్తి చేయాల‌న్న‌ది వారి ప్లాన్‌గా చెబుతున్నారు.

Samantha next Film Confirmed :

Samantha next Film with sony pictures 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ