Advertisementt

భీష్మ తర్వాత వెంకీ ఏం చేస్తున్నాడంటే..!!

Sun 03rd May 2020 11:36 PM
venky kudumula,bheeshma,venkatesh,chit chat,director venky kudumula,interview  భీష్మ తర్వాత వెంకీ ఏం చేస్తున్నాడంటే..!!
Director Venky kudumula talks about his next Project భీష్మ తర్వాత వెంకీ ఏం చేస్తున్నాడంటే..!!
Advertisement
Ads by CJ

భీష్మ సినిమాతో భారీ హిట్ అందుకున్న నితిన్ మాత్రం వెంకీ అట్లూరి రంగ్ దే సినిమాతో బిజీ కాగా... కరోనా లాక్ డౌన్ రంగ్ దే సినిమా షూటింగ్ కి బ్రేక్ వేసింది. ఇక నితిన్ ఓకే కానీ... భీష్మ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల మాత్రం ఇంకా తన నెక్స్ట్ సినిమా గురించిన ఆలోచన చెయ్యటం లేదా? లేదంటే ఎవరన్నా హీరోలను అప్రోచ్ అయ్యాడా? అనే ప్రశ్నకు వెంకీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పాడు. తాను ఇంకా స్క్రిప్ట్ వర్క్‌లోనే ఉన్నట్లుగా చెప్పాడు. భీష్మ సినిమా విడుదలయ్యాక వెంకటేష్‌గారు ఫోన్ చేసి సినిమా బావుంది అని... తర్వాత సినిమా చూసి భీష్మ సినిమా చాలా బావుంది అని అభినందించారు అని చెప్పిన వెంకీ కుడుములు.. చిరుగారు భీష్మ చూసి ప్రసంశించడం చాలా గొప్ప విషయమని చెప్పాడు.

ఇక నితిన్ తనకు త్రివిక్రమ్‌గారితో అ... ఆ సినిమా చేసినప్పటినుండి పరిచయం అని, పూరి జగన్నాధ్ గారి అమ్మానాన్న తమిళమ్మాయి సినిమా చూసినప్పటినుండి పూరికి ఫ్యాన్ అయ్యానని చెప్పాడు. ఇక భీష్మ సినిమాకన్నా ముందు ఛలో సినిమా హీరో నాగ శౌర్య తో విభేదాలేమి లేవని, అవి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదన్నాడు. భీష్మ తర్వాత మంచి కథ రెడీ చేస్తున్నా అని.. పూర్తి స్క్రిప్ట్ అయ్యాక కథకు సరిపోయే హీరోని అప్రోచ్ అవుతానని చెబుతున్నాడు వెంకీ కుడుముల. 

Director Venky kudumula talks about his next Project:

Venky Kudumula busy with his 3rd Project

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ