ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Gossips on Pushpa Movie Highlight Scene

‘పుష్ప’లో అదిరిపోయే సీన్ ఇదేనంట..!

సుకుమార్ - అల్లు అర్జున్ పుష్ప సినిమాని పాన్ ఇండియా ఫిలింగా ప్రకటించడం, ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు రావడంతో.. ఆ సినిమా విషయాలు సోషల్ మీడియాలో ఏదో ఒక రకముగా ప్రచారంలోకొస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా ఊర మాస్ లుక్ లో కనిపిస్తాడనేది.. పుష్ప ఫస్ట్ లుక్ లోనే తెలిసింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తుంది. ఇక మరో హీరోయిన్ నివేత థామస్ ఈ సినిమాలో నటిస్తుంది అనే ప్రచారం జరిగినప్పటికీ... ఈ సినిమాలో రశ్మికనే హీరోయిన్ కానీ.. మరో హీరోయిన్ ఎవరూ లేరని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.

ఇక పుష్ప సాంగ్స్ కూడా చాలావరకు దేవిశ్రీ ప్రసాద్ పూర్తి చేసాడని అంటున్నారు. అయితే తాజాగా పుష్ప సినిమాలో ఈ సీన్ హైలెట్ అంటూ ఓ న్యూస్ ప్రచారంలోకొచ్చింది. అది ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ సీన్ ఉంటుంది అని... అది కూడా అల్లు అర్జున్ లారీ ఛేజింగ్ సీన్ అని... బన్నీ లారీ డ్రైవర్ గా లారీని ఫారెస్టు అధికారులు ఛేజ్ చేసే సీన్ ఒక రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. ఈ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టెంట్ మాస్టర్ ని పిలిపిద్దామని సుక్కు అండ్ టీం ముందు అనుకున్నప్పటికీ.. ప్రస్తుత కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలోచన విరమించుకున్నారని, ఇక బాలీవుడ్ లోను, టాలీవుడ్ లోను టాప్ స్టెంట్ మాస్టర్స్ ని ఈ సన్నివేశాల కోసం వాడబోతున్నారట. ఇక పుష్ప సినిమా సెట్స్ మీదకెళ్ళడం లేట్ అయినప్పటికీ షూటింగ్ మొదలెట్టాక.. షూటింగ్ కి గ్యాప్ ఇవ్వకూడదని సుక్కు అండ్ టీం డిసైడ్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి.

Lorry chasing scene in allu arjun Pushpa

Gossips on Pushpa Movie Highlight Scene
lorry chasing scene
pushpa
allu arjun
sukumar
highlights