నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘సోగ్గాడే చిన్నినాయనా’లో నాగ్ సరసన నటించిన లావణ్య త్రిపాఠికి కూడా తన కెరీర్‌లో ఈమూవీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే అటువంటి సినిమాను లావణ్య అయిష్టంగానే ఒప్పుకుని చేయాల్సివచ్చిందని చెప్పింది. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చాలామంది నెగటివ్‌గా మాట్లాడారు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అసలు ఈమూవీ ఎందుకు చేస్తున్నావ్...నాగార్జున లాంటి సీనియర్ హీరోతో చేస్తే ఓ ముద్ర పడిపోతుందని.. తర్వాత వరుసగా అలాంటి సినిమాలే వస్తాయని అన్నారట. దాంతో ఏం చేయాలో తెలియక తాను అయిష్టంగానే ఈ సినిమాకు సంతకం చేసినట్లు లావణ్య తెలిపింది.
అయితే ఇదే విషయాన్ని నాగార్జునకి కూడా చెప్పినట్టు... ఆయన చాలా తేలికగా దాన్ని తీసేసినట్టు...పైగా తనకు ఎన్నో మంచి విషయాలు చెప్పారని, తన కెరీర్ విషయంలో చక్కటి గైడెన్స్ ఇచ్చారని.. ఇప్పటికి కూడా ఏమన్నా సలహాలు సూచనలు కావాలంటే ఆయనను అడుగుతానని చెప్పింది. ఇక రామ్‌తో నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో తన మేకప్ ఏమాత్రం బాగా లేదన్న విమర్శలు చాలా విన్నానని, దానికి తాను కూడా ఒప్పుకుంటానని.. ఇప్పుడు పాత్రలు సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పింది. ఇక నేను ప్రస్తుతం ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సినిమాలో హాకీ క్రీడాకారిణిగా చాలా మంచి పాత్ర చేస్తున్నానని.. దీంతో పాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నానని లావణ్య చెప్పుకొచ్చింది.