హీరోయిన్ అంటే గ్లామర్ ఒలకబోయాల్సిందే అని చాలా మంది దర్శకనిర్మాతలు నమ్ముతుంటారు. ఇక ప్రేక్షకుల్లో ఎక్కువ భాగం గ్లామర్ కోసమే హీరోయిన్లు ఉంటారని అనుకుంటారు. హీరోయిన్ లేకుండా సినిమాలు తీస్తే డబ్బులు మిగులుతాయి అనుకుంటున్న ఇండస్ట్రీ గురించి ప్రేక్షకులు అలా అనుకోవడంలో తప్పు లేదేమో. అయితే హీరోయిన్లు కూడా గ్లామర్ ఒలకబోయడం తప్పు కాదని భావిస్తుంటారు. అది నిజం కూడా. కానీ కొన్ని పరిమితులకి లోబడి మాత్రమే..
గ్లామర్ షో చేయని హీరోయిన్లకి అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. వంద మందిలో ఒకరికో, ఇద్దరికో గ్లామర్ షో చేయకపోయినా అవకాశం వస్తూ ఉంటుంది. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన భామ లావణ్య త్రిపాఠికి సక్సెస్ రేటు చాలా తక్కువ. ఆమె అందంగా ఉంటుంది కానీ ఎక్కడో ఏదో లోపం ఉన్నట్టు కనబడుతుందని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తుంటారు. అయితే ఆ విమర్శలని సీరియస్ గా తీసుకున్న లావణ్య, లోపమంతా మేకప్ లో ఉందని గుర్తించిన లావణ్య, జాగ్రత్తగా ఉంటుందట.
ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు చేయని లావణ్య, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే బికినీకి కూడా రెడీ అంటుంది. అలాగే హీరోయిన్ల పాత్రలకి ప్రాధాన్యం ఇస్తున్న మళయాల సినిమాల్లో నటించాలని ఉందట. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి సందీప్ కిషన్ సరసన ఏ౧ ఎక్స్ ప్రెస్ సినిమాలో హాకీ క్రీడాకారిణిగా కనిపిస్తుంది.