Advertisementt

నాగబాబు కారణంగా రామ్ చరణ్‌కి బెల్ట్ దెబ్బలు

Fri 01st May 2020 07:23 PM
ram charan,nagababu,childhood,beats,chiranjeevi,memories  నాగబాబు కారణంగా రామ్ చరణ్‌కి బెల్ట్ దెబ్బలు
Ram Charan revealed his Childhood Secrets నాగబాబు కారణంగా రామ్ చరణ్‌కి బెల్ట్ దెబ్బలు
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరో. ప్రస్తుతం ఎన్టీఆర్ తో RRR మూవీ చేస్తున్నాడు. అయితే కరోనా లాక్ డౌన్ తో షూటింగ్ కి బ్రేకిచ్చిన రామ్ చరణ్, చిరు అంతా ఇంట్లోనే సమయాన్ని గడుపుతున్నారు. తాజాగా రామ్ చరణ్ తన చిన్ననాటి ముచ్చట్లను మాట్లాడుతూ.. చిన్న తన తండ్రి చేతిలో పోలీస్ బెల్ట్ తో దెబ్బలు తిన్నా అని.. అది కూడా నాగబాబు బాబాయ్ వలన అంటూ చెబుతున్నాడు. తాను గేట్ దగ్గర వాచ్ మేన్స్ ఇద్దరు మట్లాడుకునే మాటలు విని నాగబాబు బాబాయ్ ని ఆ మాటలకు అర్ధం ఏమిటి అని అడిగితే... అప్పుడే మా నాన్న చిరు షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రావడంతో... బాబాయ్ నాన్నని రూమ్ లోకి తీసుకెళ్లి వీడు బూతులు నేర్చుకుని దానికి అర్థం నన్నే అడుగుతున్నాడంటూ కంప్లైంట్ ఇచ్చాడని చెప్పాడు.

 

దానితో నాన్న చిరు తాత గిఫ్ట్‌గా ఇచ్చిన పోలీస్ బెల్ట్ తో తనని కొట్టారని... దాని తర్వాత నాగబాబు బాబాయ్ తో చాలా రోజులు మాట్లాడలేదని చెబుతున్నాడు రామ్ చరణ్. ఇక తర్వాత నాన్న నన్ను దగ్గరకు తీసుకుని... మళ్ళీ బూతులు మాట్లాడవద్దని చెప్పారని చెబుతున్నాడు. ఇక ఇప్పటికీ నాన్నతో కలిసి ఉన్నప్పుడు మాట్లాడడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటా అని.. ఆ తర్వాత మళ్ళీ నాన్న నా మీద చెయ్యి చేసుకోలేదని చెప్పడమే కాదు.. భార్య ఉపాసన కి తన తండ్రి చిరు మంచి ఫ్రెండ్ అని.. నేను దూరంగా ఉన్నా.. ఉపాసన మాత్రం నాన్నతో మరో సొంత బిడ్డలాగా కలిసిపోతుందని చెబుతున్నాడు. 

Ram Charan revealed his Childhood Secrets:

Ram Charan vs Nagababu in childhood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ