మీడియాతో పెట్టుకున్నోళ్లు బాగుపడ్డట్లు బహుశా చరిత్రలో ఎక్కడా లేదేమో. పెద్ద పెద్ద తోపులు, తీస్మార్ ఖాన్‌లు సైతం మీడియాపై సెటైర్లు, కట్టడి చేసి నానా ఇబ్బందులు పెట్టినా ఆపై తప్పులు తెలుసుకుని క్షమాపణలు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయ్. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో అయితే ఓ యంగ్ హీరో మీడియాను వెంట్రుకతో పోల్చి ఆ తర్వాత తప్పయిపోయిందని క్షమించమని కోరాడు. అంతేకాదు.. ఒకానొక సందర్భంలో ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖుడు మీడియానే బహిష్కరిస్తున్నట్లు ఫలానా చానెల్‌ను ఎవరూ చూడకండని పిలుపునిచ్చి అదే చానల్‌తో.. చానెల్‌లో మళ్లీ ఇప్పుడు తెగ కనిపించేస్తున్నాడు. వీరందరికీ మీడియా వాల్యూ ఏంటో తెలిసింది. అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఎందుకో మీడియాపై ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడని ఆయన కామెంట్స్‌ను బట్టి తెలుస్తోంది.
ఎందుకిలా.. ఏమైంది!?
వాస్తవానికి మీడియాలో ప్రత్యేకించి సినిమా వెబ్‌సైట్స్‌లో రూమర్స్‌కు సంబంధించి వార్తలు ఎక్కువగా వస్తుంటాయ్. అయితే దానిపై వివరణ ఇచ్చుకోవడమా లేకుంటే లైట్ తీసుకోవడం చేయాలంతే.. కానీ ఎందుకు ప్రభాస్ ఈ రెండూ చేయకుండా కాస్త అతిగానే రియాక్ట్ అయ్యాడు. గత కొంత కాలంగా డార్లింగ్ పెళ్లిపై వరుస కథనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సెలబ్రిటీ పైగా స్టార్ హీరో గనుక ఏ ఇంటర్వ్యూలో అయినా.. ఏ మీడియాలో అయినా ఈ ప్రశ్న సర్వసాధారణంగా ఎదురవుతూ ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు దీనిపై వార్తలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయ్ కూడా. ఏదో ఒకటి చెప్పి తిన్నగా నవ్వుతూ తప్పించుకోవాల్సిన ప్రభాస్ మీడియాపైనే సెటైర్ వేయడం కంటే కెలికాడంటే సరిగ్గా సరిపోతుందేమో.
ఇవీ ప్రభాస్ మాటలు..
‘నేను నా పెళ్లి విషయంలో విముఖంగా లేను.. ఖచ్చితంగా పెళ్లయితే చేసుకుంటా. అయితే అది ఎప్పుడు అన్నద మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. నా పెళ్లి విషయంలో మా ఫ్యామిలీ కంటే మీడియానే ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తోంది’ అంటూ సెటైర్ వేశాడు. రెండు మాటలతో ముగించాల్సిన ప్రభాస్.. మూడో మాట మాట్లాడేసరికి అది కాస్త కాంట్రవర్సీగా మారింది. అసలు పోయి పోయి మీడియాను కెలుక్కోవడం అవసరమా సార్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొదరైతే అయ్యా.. తమర్ని ఈ స్థాయికి తెచ్చింది మీడియానే అనే విషయం మరిచితారా..? అని ప్రశస్తిన్నారు. ఏదైతేనేం మీడియాను కెలుక్కోవడం అంత మంచిది కాదేమో ప్రభాస్.. ఒకసారి ఆలోచించు డార్లింగ్. కాస్త వెనక్కి వెళ్లి ఇదివరకు మీడియాపై కామెంట్స్, సెటైర్లేసిన వారి పరిస్థితి తెలుసుకుంటే మంచిదని కొందరు మీడియాలోని పెద్దలు చెప్పుకొస్తున్నారు.