Advertisementt

ఇర్ఫాన్, రిషి మృతిపై నటుడు షాకింగ్ కామెంట్స్!

Fri 01st May 2020 10:59 AM
actor kamal r khan,shocking comments,irfan khan,rishi kapoor,death,bollywood  ఇర్ఫాన్, రిషి మృతిపై నటుడు షాకింగ్ కామెంట్స్!
Actor Shocking Comments On Irfan and Rishi Kapoor Death! ఇర్ఫాన్, రిషి మృతిపై నటుడు షాకింగ్ కామెంట్స్!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. మొన్న విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించగా.. నిన్న దిగ్గజ నటుడు రిషి కపూర్ కన్నుమూశారు. ఇద్దరూ ఇద్దరే ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలేసిన బాద్ షాలే!. అంతేకాదు ఇద్దరూ కూడా 2018 నుంచి కేన్సర్ మహమ్మారితో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. ఇరువురి మరణంతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదం మునిగిపోయారు. ఇలాంటి తరుణంలో వారికి భరోసా ఇవ్వాల్సింది పోయి కొందరు మాత్రం అతి చేస్తూ చావుపై వివాదాలు రేపడం ఎంతవరకు సమంజసమో.

అసలు విషయానికొస్తే.. నటుడు కమల్ ఆర్ ఖాన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌లో అత్యంత వివాదాస్పద నటుడిగా ఈయన పేరుంది. టాలీవుడ్‌లో ఒకరిద్దరిలాగానే ఈయన కూడా బాలీవుడ్‌లో తెగ రెచ్చిపోతుంటాడు. నిత్యం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల మీద.. వారు తీసే సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఎవర్నీ వదలకుండా కామెంట్స్ చేసిన రోజులున్నాయ్!. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయనకు నోటి దూల ఎక్కువ. ఇప్పటికే పలుమార్లు సంచలన కామెంట్స్ హాట్ టాపిక్ అయిన ఆయన.. తాజాగా బాలీవుడ్ దిగ్గజాల మరణాలపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కొందరు ఫేమస్ లీడర్స్‌ను తీసుకుపోతుందని.. అలా తీసుకుపోనిదే ఇక్కడ్నుంచి బయటికెళ్లదని తాను కొన్ని రోజుల క్రితమే చెప్పానని పరోక్షంగా ఆ ఇద్దరి మరణాలపై కమల్ వ్యాఖ్యానించాడు. అంతటితో ఆగని ఆయన ఇర్ఫాన్, రిషి మరణిస్తారని తనకు ముందే తెలుసుని.. తర్వాత ఎవరు చనిపోతారో కూడా తనకు తెలుసని షాకింగ్ ట్వీట్ చేసి అందరి నోళ్లలో నానుతున్నాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈయనపై చర్యలు తీసుకోవాలని బాలీవుడ్ పెద్దలకు, పోలీసులకు పలువురు ఫిర్యాదులు చేశారు. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కోకొల్లలు.. అలాగే క్షమాపణలు సందర్భాలూ ఉన్నాయ్. తాజా వ్యాఖ్యలపై వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి.

Actor Shocking Comments On Irfan and Rishi Kapoor Death!:

Actor Shocking Comments On Irfan and Rishi Kapoor Death!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ