టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ - హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా ‘పుష్ప’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో ఓరల్‌గా పాన్ ఇండియా చిత్రంగా ‘పుష్ప’ విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి చాలా పుకార్లు షికార్లు చేయగా.. కొన్ని కొన్ని అప్డేట్స్ అభిమానులను ఆనందపరిచాయి. అయితే తాజాగా సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగు చూసింది.
అదేమిటంటే.. హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతిపోగొడుతున్న అందాల భామ దిశా పటానీ ‘పుష్ప’లో అందాలు ఆరబోయనుందట. హీరోయిన్‌గా కాదు.. సెకండ్ హీరోయిన్‌గా కూడా కాదండోయ్.. స్పెషల్ సాంగ్‌లో నర్తించి మెగాభిమానులు, బన్నీ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తుందట. ఇటీవలే ఆమెను సంప్రదించారని 24 గంటలు అడిగిన ఆ భామ ఆఖరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇప్పటికే వరుణ్ తేజ్ ‘లోఫర్’ మూవీలో ఆడిపాడి హాట్ హాట్ హోయలు ఒలగబోసిన ఈ భామ మరోసారి టాలీవుడ్‌లో అందాల ఆరబోతకు రెడీ అయ్యిందన్న మాట. గతంలో బన్నీ ‘ఐకాన్’లోనూ ఈ భామే నటించనుందని పుకార్లు వచ్చాయి.
కాగా.. ‘రంగస్థలం’ జిల్ జిల్ జిగేలీ రాజా అంటూ స్పెషల్ సాంగ్ పెట్టిన సుక్కు అంతకు మించిన సాంగ్ పెట్టాలని భావిస్తున్నాడట. అందుకే దిశా అయితే సెట్ అవుతుందని సంప్రదించారట. ఈ సాంగ్ మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందట. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం విదితమే. గతంలోనూ వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఇదిలా ఉంటే.. బన్నీ ఈ మూవీలో డబుల్ షేడ్స్‌లో కనిపించి మెప్పించబోతున్నాడట. మూవీలో అల్లు అర్జున్ ‘డాన్’గా కూడా కనపడతారని టాక్ నడుస్తున్నది. ఈ డాన్ సరసనే దిశా అందాల ఆరబోసి కనువిందు చేయనుందట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి లేదా సినిమా రిలీజ్ అయ్యే వరకూ వేచి చూడాల్సిందే.