Advertisementt

వద్దు వద్దన్నవారు..ఆ రీచ్ చూసి ఆశ్చర్యపోతున్నారు..

Thu 30th Apr 2020 01:28 PM
david warner,buttabomma,allu arjun,pooja hegde,ala vaikunthapurramulo,thaman,srh  వద్దు వద్దన్నవారు..ఆ రీచ్ చూసి ఆశ్చర్యపోతున్నారు..
David Warner shake his leg for Buttabomma వద్దు వద్దన్నవారు..ఆ రీచ్ చూసి ఆశ్చర్యపోతున్నారు..
Advertisement
Ads by CJ

తెలుగు సినిమా సంగీత దర్శకులలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పేరు థమన్. దేవిశ్రీ ప్రసాద్ ని దాటేసి మొదటి స్థానంలో కూర్చున్నాడు. థమన్ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. ఆయన కోసం ఎంతో మంచి వెయిట్ చేస్తున్నారు. కిక్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన థమన్, మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు. కానీ ఆ తర్వాత అంతగా మెప్పించలేకపోయాడు.

పాటల్లో మాటలు వినబడకుండా డప్పు శబ్దాలతో నింపేస్తాడని విమర్శ చేసారు. చాలా మంది సెలెబ్రిటీలు సైతం ఇదే మాట అనేవారు. అలా అని థమన్ కి ఆఫర్స్ ఉండకపోవడమనేది ఎప్పుడూ లేదు. ఆఫర్స్ కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడని అంటుండేవారు. అయితే థమన్ తాను చేస్తున్న తప్పులు తెలుసుకున్నాడో, లేక ట్రెండ్ మారిందని తాను మారాడో తెలియదు కానీ, ఇప్పుడు చేస్తున్న ట్యూన్లకి శ్రోతలు ఫిదా అవుతున్నారు.

మహానుభావుడు, తొలిప్రేమ సినిమా దగ్గరి నుండి థమన్ లో ఈ మార్పును గమనించవచ్చు. ఇక అలవైకుంఠపురములో సినిమాతో అతడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. ఒక సినిమాలోని అన్ని పాటలకి ఒకేలా రెస్పాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. అల వైకుంఠపురములోని పాటలు బిలియన్ వ్యూస్ దక్కించుకుని రికార్డు క్రియేట్ చేసాయి. 

ఇక బుట్టబొమ్మ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాట రీచ్ మామూలుగా లేదు. బాలీవుడ్ హీరోయిన్ల దగ్గరి నుండి ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వరకూ ఈ పాటకి స్టెప్పులేసిన వాళ్లే. ఈ రీచ్ చూసి థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తమ సినిమాలకి తీసుకోని వాళ్ళు షాక్ అయ్యుంటారు.

David Warner shake his leg for Buttabomma:

David warner shake his leg for Buttabomma

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ