Advertisementt

నన్ను పడేయాలంటే అది చేయండి: త్రిష

Fri 01st May 2020 08:39 AM
trisha,dating 500 words,heroine trisha,impress,poem  నన్ను పడేయాలంటే అది చేయండి: త్రిష
Trisha gives interest challenge to Her Fans నన్ను పడేయాలంటే అది చేయండి: త్రిష
Advertisement
Ads by CJ

రెండు దశాబ్దాలు పాటు అగ్ర హీరోయిన్ గా సినిమాలతో అలరించిన త్రిష ప్రస్తుతం చాలా తక్కువ సినిమాలతో అలరిస్తుంది. స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాల పాటు ఆఫర్స్ అందుకోవడం అంటే మాములు విషయం కాదు. తెలుగులో వర్షం సినిమాతో మొదలైన త్రిష ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. తన సొంత భాష తమిళంలో చాలానే సినిమాలు చేసింది. కొంతమందితో డేటింగ్ కూడా చేసిన త్రిష రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లైవ్ లో తన ఫ్యాన్స్ కి అదిరిపోయే ఆఫర్ ఒకటి ఇచ్చింది. నన్ను పడేయాలంటే ఇలా ట్రై చేయండి అంటూ ఆఫర్ ఇచ్చింది.

‘‘నేను ప్రస్తుతం ఎవరితో డేటింగ్  చేయడం లేదు.. మీకు నాపై ఇంట్రెస్ట్ ఉంటే… ఓ 500 పదాలతో వ్యాసం రాయండి. మీరు నా సమయాన్ని వృథా చేయకుండా ఎలా చూసుకుంటున్నారో ఈ వ్యాసంలో వివరించి, ఇంప్రెస్ చేయండి’’ అంటూ త్రిష తన ఫ్యాన్స్‌కి ఆఫర్ ఇచ్చింది. మరి తనను ఎవరైతే 500 పదాల్లో ఇంప్రెస్స్ చేస్తారో అతనితో డేట్ చేస్తుందన్నమాట. ఆమధ్య త్రిషకి చెన్నై కి చెందిన ఓ బిజినెస్ మ్యాన్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ అది పెళ్లి దాకా వెళ్ళలేదు. అప్పటిలో రానా తో కూడా డేటింగ్ చేసింది త్రిష. కానీ ఇప్పుడు సడన్ గా ఫ్యాన్స్ తోనే డేట్ చేస్తా అనడం చాలా వింతగా ఉంది. లాక్ డౌన్ టైములో ఏం చేయాలో తెలియక ఇలా చేసిందేమో అంటున్నారు.

Trisha gives interest challenge to Her Fans:

Dating Offer from Trisha for Her Fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ