రంగస్థలం సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అందుకున్న సుకుమార్, అల వైకుంఠపురములో సినిమాతో రంగస్థలం రికార్డుని బ్రేక్ చేసి నాన్ బాహుబలి రికార్డుని నెలకొల్పిన బన్నీతో పుష్ప సినిమా చేస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకి ముందు మహేష్ తో సినిమా తీద్దామనుకున్న సుకుమార్ తెలంగాణ సాయుధ పోరాటంపై కథ రాసుకున్నాడట. దానికోసం చాలా రీసెర్చి చేశాడట.
సాయుధ పోరాటాన్ని కథాంశంగా తీసుకుని మహేష్ బాబుని హీరోగా పెడ్తే ఎలా ఉంటుందని ఆలోచించాడట. అయితే చాలా మంది మహేష్ కి అలాంటి కథ సెట్ అవదని చెప్పేసరికి ఇప్పుడు బన్నీతో చేస్తున్న కథనే వినిపించాడట. కానీ మహేష్ ఒప్పుకోకపోవడంతో అదే కథకి కొన్ని మార్పులు చేసి అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. అయితే సుకుమార్ లాంటి దర్శకుడు తెలంగాణ సాయుధ పోరాటాన్ని కథాంశంగా తీసుకుని సినిమాగా చేస్తే, నిజంగా చాలా బాగుంటుంది. మరి భవిష్యత్తులోనైనా తెలంగాణ సాయుధ పోరాటం మీద సినిమా చేస్తాడేమో చూడాలి.