మెగస్టార్ చిరంజీవి-హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా ఏ టైమ్‌లో కొబ్బరి కాయ కొట్టారో కానీ.. అన్నీ వరుస షాక్‌లే తగులుతున్నాయ్. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికే సినిమా సగానికి పైగా షూటింగ్ అయిపోయింది కానీ కరోనా దెబ్బతో మొత్తం సీన్ మారిపోయింది. ఈ క్రమంలో ఇంటి నుంచే మెరుగులు దిద్దే పనిలో ఉన్న చిత్ర దర్శకనిర్మాతలకు వరుస షాక్‌లు తగులుతున్నాయ్. సీనియర్ నటి త్రిష మూవీ నుంచి తప్పుకోవడం.. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు కీలక పాత్ర నుంచి వైదులొగడం.. వీరిద్దరిచ్చిన షాక్ నుంచి తేరుకోక మునుపే హీరోయిన్‌గా ఫిక్స్ చేసిన కాజల్ కూడా తప్పుకోవడం ‘ఆచార్య’ మూవీ యూనిట్‌కు కాసింత కలవరపాటుకు గురయ్యే విషయం.
కారణం ఇదేనా..!?
వాస్తవానికి ‘ఆచార్య’ కోసం కాజల్‌ను తీసుకుంటున్నట్లు అధికారికంగా దర్శకనిర్మాతలు ప్రకటించక మునుపే ఈ భామే తనకు తానుగా సోషల్ మీడియా ద్వారా చెప్పేసింది. దీంతో రెండోసారి ఈ కాంబో వస్తోందని అభిమానులు కూడా ఆనందపడ్డారు. అయితే తాజాగా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కాజల్ కూడా ఈ సినిమా నుంచి వైదొలిగిందట. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయట. సినిమా సంప్రదించిన టైమ్‌లో చెప్పిన పారితోషికానికి.. కరోనా తర్వాత ఇచ్చే రెమ్యునరేషన్‌కు అస్సలు సంబంధమే ఉండదని గ్రహించిందో.. లేకుంటే ఊహించుకుందో కానీ ‘ఆచార్య’లో నటించకూడదని ఫిక్స్ అయ్యిందట.
అసలు ఎందుకిలా..!?
‘ఆచార్య’ నుంచి తప్పుకున్న తర్వాత తెలుగులో మాస్ మహారాజ్ రవితేజ సరసన నటిస్తున్నట్లు తెలియవచ్చింది. రవితేజ-రమేశ్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటించాలని త్రిషను సంప్రదించగా కచ్చితంగా చేస్తానని మాటిచ్చిందట. ఇప్పుడు కాజల్ కూడా ఈ మూవీ నుంచి తప్పుకున్నాకా ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ జోడీగా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంతేకాదు.. ఇప్పటికే బల్క్‌గా డేట్స్ కూడా ఇచ్చేసిందని టాక్ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభం కానుందట.
ఎవరొస్తారో ఏంటో..!?
ఈ సినిమా చేయడానికి.. ‘ఆచార్య’ నుంచి తప్పుకోవడానికి పారితోషికమే కారణమట. తమిళ సినిమాకు భారీ రెమ్యునరేషన్ ముట్టుతోందట. మరీ ముఖ్యంగా స్టాలిన్ చిత్రంలో కాజల్ పాత్ర అదిరిపోయేలా ఉంటుందని.. అయితే ‘ఆచార్య’లో అంతగా ప్రాధాన్యం లేకపోవడం కూడా ఈ భామ తప్పుకోవడానికి ఓ కారణమని తెలుస్తోంది. ఈ పుకార్లపై కాజల్ కానీ లేదా దర్శకనిర్మాతలు లేదా చిరు స్పందిస్తే క్లారిటీ వచ్చే అవకాశముంది. ఒకవేళ ఇదే నిజమైతే మళ్లీ ‘ఆచార్య’ హీరోయిన్ చిక్కులు వచ్చినట్లే. ఫైనల్‌గా ఎవర్ని తీసుకుంటారో.. త్రిష, కాజల్ స్థానంలో చాన్స్ దక్కించుకునే ఆ బ్యూటీ ఎవరో తెలియాల్సి ఉంది.