Advertisementt

RRR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ట్రీట్ అదిరిపోతుందట!

Thu 30th Apr 2020 07:47 AM
rrr,jr ntr,birthday special video,tammiraju,rajamouli,ram charan  RRR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ట్రీట్ అదిరిపోతుందట!
Excellent treat from jr ntr fans from RRR RRR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ట్రీట్ అదిరిపోతుందట!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ పుట్టిన రోజు స్పెషల్ గా రాజమౌళి RRR లో రామ్ చరణ్ వీడియో రిలీజ్ చెయ్యడం... అది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలివడంతో మెగా ఫాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అందులో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తోనూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజుకి రాజమౌళి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరో స్పెషల్ వీడియోని రెడీ చేశాడంటున్నారు. కరోనా లాక్ డౌన్ తో ఎన్టీఆర్ స్పెషల్ టీజర్‌ని ఓ రేంజ్ లో అదిరిపోయేలా కట్ చేసాడని.. ఎడిటింగ్ వర్క్, డబ్బింగ్ వర్క్ ని ఇప్పటికే పూర్తి చేసాడని అంటున్నారు.

ఇప్పటివరకు ఎన్టీఆర్ పై చిత్రీకరించిన సన్నివేశాల్లో ద బెస్ట్ సన్నివేశాలను ఎడిటర్ తమ్మిరాజు తన ఇంటిలోని ఎడిటింగ్ రూమ్‌లోనే ఎడిట్ చేసాడని... అవుట్ ఫుట్ విషయంలో రాజమౌళి టీం చాలా తృప్తిగా ఉన్నారని అంటున్నారు. మరి ఎన్టీఆర్ బర్త్ డే కానుక గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రాజమౌళి ఎలా మెస్మరైజ్ చేస్తాడో కానీ... RRR ఎన్టీఆర్ వీడియోలో మెయిన్ గా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. మరి ఎన్టీఆర్ వీడియో కూడా బ్లాక్ బస్టర్ రేంజ్లో ఉండబోతుంది అనే టాక్ తోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు.

Excellent treat from jr ntr fans from RRR:

RRR Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ