ఆర్ఎక్స్ 100 చిత్రం ఒక ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. చాలా తక్కువ బడ్జెట్ అంటే 2 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిందంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంత చిన్న సినిమా అంత పెద్ద సక్సెస్ అయినప్పటికీ దాన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అజయ్ ఇంతవరకు తన రెండో సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళలేదు.
ఆమధ్య రవితేజతో మల్టీ స్టారర్ చేద్దాం అనుకున్నాడు కానీ ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఆ తరువాత అజయ్ చాలామంది హీరోస్ ని ట్రై చేసి చివరికి ప్రధాన కథానాయకుడిగా శర్వానంద్‌ను ఖరారు చేశాడు. ఇక రెండో హీరో కోసం చాలా కష్టపడినా తరువాత తమిళ హీరో సిద్దార్థ్‌ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఆర్ఎక్స్ 100 లాంటి పెద్ద హిట్ ఇచ్చిన అజయ్ కి హీరోస్ ఛాన్స్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్నట్లున్నాడు.
పైగా హీరోస్ కోసమే ఏడాది పట్టడంతో ఫుల్ ఫ్రస్టేట్ అవుతున్నాడు. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో అజయ్ మాట్లాడుతూ.. ‘‘తన కెరీర్లో ఇదే తొలి, చివరి మల్టీస్టారర్ అని చెప్పడం గమనార్హం. ఇలాంటి కథ రాయడం ఒకెత్తయితే.. హీరోల్ని ఒప్పించడం మరో ఎత్తు’’ అంటున్నాడు. ఏది అయితేనేం సినిమా అయితే సెట్స్ మీదకు వెళ్తుంది. ఇక దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి అనిల్ సుంకర ముందుకు వచ్చారు. లాక్ డౌన్ తరువాత ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది.