Advertisementt

లాక్డౌన్ వేళ రష్మిక చెప్పిన ముచ్చట్లు..

Wed 29th Apr 2020 11:47 AM
rashmika mandanna,lockdown celebrities,tollywood,telugu film industry  లాక్డౌన్ వేళ రష్మిక చెప్పిన ముచ్చట్లు..
Rashmika talks in Lockdown time.. లాక్డౌన్ వేళ రష్మిక చెప్పిన ముచ్చట్లు..
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్స్ పక్కన నటించడానికి రష్మిక మందన్న ఏకైక ఆప్షన్ గా మారింది. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో రష్మిక మందన్న ఒక పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఈ సినిమా ఆమె కెరీర్లోనే ది బెస్ట్ గా నిలవనుందని అంటున్నారు.

లాక్డౌన్ పీరియడ్ లో ఇంట్లోనే ఉంటున్న రష్మిక, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. లాక్డౌన్ ముగిసిన వెంటనే ఎప్పటి నుండో కలవాలనుకుంటున్న స్నేహితులని కలుస్తుందట. ఎవ్వరినీ కలవకుండా ఇంట్లో ఇన్ని రోజులు గడపడం ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్తుంది. ఇంక తాను నటించిన హీరోలందరిలో ఎవరు ది బెస్ట్ అని అడగ్గా, ఒక్కొక్కరికీ ఒక్కో ప్రత్యేకతలు ఉంటాయి. మీకెవరు ఇష్టం అని రివర్స్ల్ లో ప్రశ్న వేసింది. 

ఇంకా తమిళ చిత్రాల్లో నటిస్తున్నారా అన్న ప్రశ్నకి, ఇప్పటికే ఒక సినిమా చేశాను. కానీ లాక్డౌన్ కారణంగా సినిమా విడుదల కాలేదనీ, లాక్డౌన్ ఎత్తేసి, థియేటర్లు తెరుచుకున్న తర్వాత ఈ సినిమాని చూడవచ్చని తెలిపింది. ఇక మరో విషయం, రష్మిక ఐదు పెంపుడు కుక్కలని పెంచుతుందట. వాటితో పాటు మరో ఎనిమిది కుక్కపిల్లలు కూడా ఉన్నాయట.

Rashmika talks in Lockdown time..:

Rashmika talks with fans in Lockdown period

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ