Advertisementt

అల్లు శిరీష్‌కు శశి కథ ఓకే.. గ్రీన్ సిగ్నల్!

Wed 29th Apr 2020 12:32 AM
allu sirish,green signal,vijetha movie director,rakesh shashi  అల్లు శిరీష్‌కు శశి కథ ఓకే.. గ్రీన్ సిగ్నల్!
Allu Sirish Green Signal To Vijetha Movie Director! అల్లు శిరీష్‌కు శశి కథ ఓకే.. గ్రీన్ సిగ్నల్!
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ నుంచి క్రికెట్‌ టీమ్ కంటే ఎక్కువగా హీరోలు వచ్చినప్పటికీ ఒకరికద్దరు తప్ప అందరూ సక్సెస్ అయ్యారు. ఇంకొంత మంది సక్సెస్ అయ్యి పునాదులు నిలుపుకోవడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ జాబితాలో అల్లు శిరీష్ కూడా ఉన్నాడు. ఇప్పటి వరకూ ఈ కుర్ర హీరో నటించిన సినిమాల్లో గట్టిగా చెప్పుకోవడానికి ఏమీ లేవు. మరోవైపు దూసుకుపోవడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, నిదానమే ప్రధానం అన్నట్టుగా సినీ కెరీర్‌ను నడిపించేస్తున్నాడు. అటు ‘అన్నయ్య’ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యమా స్పీడ్‌తో దూసుకెళ్తుండటం.. ఇటు శిరీష్ మాత్రం చాలా స్లోగానే బండి నడిపించేస్తున్నాడు. అయితే తాజాగా శిరీష్‌కు సంబంధించి ఓ అప్డేట్ వెలుగుచూసింది.

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ సినిమాను తెరకెక్కించి ఫర్లేదు అనిపించుకున్నాడు రాకేశ్ శశి. అయితే అదే దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా ఉంటుందని తాజాగా మెగా కాంపౌండ్‌లో టాక్ నడుస్తోంది. ఇటీవలే ఫోన్‌లో శిరీష్‌కు శశి స్టోరీ లైన్‌ చెప్పగా.. నచ్చిందని లాక్ డౌన్ అవ్వగానే గీత స్టూడియోలో కూర్చుందామని చెప్పాడట. అంటే శశికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే అన్న మాట. కథ బాగా ఎమోషనల్‌గా ఉంటుందని టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే.. స్టోరీ విషయం తన తండ్రి అల్లు అరవింద్‌కు చెప్పగా బాగుందన్నారని.. ఈ సినిమాకు సంబంధించి బాధ్యతలన్నీ బన్నీ వాసే చూసుకుంటాడని సమాచారం. గీతా ఆర్ట్స్-02 బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితం కానుందన్న మాట. లాక్ డౌన్ అవ్వగానే బన్నీ వాస్, శిరీష్ ఇద్దరూ ఫుల్ స్టోరీ విని ఆ తర్వాత అధికారిక ప్రకటన చేస్తారట. అయితే మెగా అల్లుడ్ని ఫర్లేదు అనిపించిన శశి.. మెగాస్టార్ మేనల్లుడిని ఏమనిపిస్తాడో.. అభిమానులను మెప్పించే సినిమా తీస్తాడో లేదో.. వాస్తవానికి శిరీష్‌కు ఇప్పుడు హిట్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ కాంబోలో సినిమాపై వస్తున్న పుకార్లు ఎంతమేరకు నిజమో.. తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ వేచి చూడాల్సిందే.

Allu Sirish Green Signal To Vijetha Movie Director! :

Allu Sirish Green Signal To Vijetha Movie Director!   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ