విభిన్న కథలతో సినిమాలు చేసే నేచురల్ స్టార్ నాని 27వ సినిమా టైటిల్‌కు ‘శ్యామ్ సింగ రాయ్’ అనే టైటిట్‌ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించబోతుండగా.. సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ‘హిట్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మంచి కలెక్షన్ల మీదున్న (నిర్మాతగా) నాని తాజా చిత్రం ‘వి’ విడుదలకు రెడీగా ఉంది. కరోనా కష్టకాలం కాస్త తగ్గితే థియేటర్లలోకి రావడానికి ‘వీ’ సిద్ధంగానే ఉంది. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ తన 27వ సినిమాపై నాని, దర్శక నిర్మాతలు దృష్టిసారించారట.
ఈ సినిమాకు మ్యూజిక్ ప్రాణంగా నిలవనుండటంతో అంతా బ్యా గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌నే రంగంలోకి దింపుతున్నారని టాక్ నడిచింది. అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగుచూసింది. అదేమిటంటే.. ఈ చిత్రంలో నాని సరసన ఒకప్పుడు ‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్‌ను తీసుకుంటున్నారట. అంటే ఇదే నిజమైతే ఈ జోడి మళ్లీ రొమాన్స్ చేస్తుందన్న మాట. మొత్తం ముగ్గురు కథానాయికలకు అవకాశం ఉందని.. అందులో అను కూడా ఒకరని.. విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇటీవలే దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదించారని.. త్వరలోనో దీనిపై క్లారిటీ వస్తుందని.. రిప్లయ్ రాగానే అధికారిక ప్రకటన చేస్తారని టాక్. ఈ భామ ‘అల్లుడు అదుర్స్’ చిత్రంతో బిజీగా ఉంది. అప్పుడెప్పుడో 2018లో ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రంలో అలరించిన ఈ భామకు ఇప్పుడు మళ్లీ తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయ్.. వీటితో అయినా టాలీవుడ్‌గా గట్టిగా నిలదొక్కుకుంటుందేమో వేచి చూడాలి.