Advertisementt

బాలకృష్ణతో రాజమౌళి సినిమా ఎప్పుడు?

Wed 29th Apr 2020 12:29 AM
balakrishna,rajamouli,rrr,collections,nandamuri fans  బాలకృష్ణతో రాజమౌళి సినిమా ఎప్పుడు?
Rajamouli Talks about Movie with Balakrishna బాలకృష్ణతో రాజమౌళి సినిమా ఎప్పుడు?
Advertisement
Ads by CJ

ఇండియాలోనే స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరు రాజమౌళి. ఇతనితో సినిమా చేయడానికి చాలామంది ఎదురుచూస్తున్నారు. రాజమౌళి కూడా ఫలానా హీరోస్ తో చేయాలనీ అనుకుంటున్నారు. లాక్ డౌన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు రాజమౌళి. ఇంటర్వ్యూ సందర్భంలో బాలకృష్ణతో మూవీ చేస్తారా? అన్న ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ... ప్రతి డైరెక్టర్‌కి ప్రతి స్టార్ హీరోతో పని చేయాలనీ ఉంటుందని... దాని ద్వారా తమ స్థాయి కూడా పెరుగుతుందని... ఏదన్నా కథ అనుకున్నప్పుడు ఫలానా హీరో అయితే సరిపోతాడని దర్శకులకు అనిపిస్తుందని, అలానే తనకు కొన్ని కథలు విన్నప్పుడు బాలకృష్ణ అయితే దీనికి సెట్ అవుతాడని చాలా సందర్భాల్లో అనిపించిందని, కానీ దాన్ని సెట్స్ మీదకు తీసుకుని రావడానికి వీలుపడలేదని అన్నారు. కానీ బాలకృష్ణ సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానని చెప్పారు.

అంటే ఇండైరెక్ట్ గా రాజమౌళి బాలయ్యతో సినిమా ఉంటుందని చెప్పకనే చెప్పాడు. కానీ ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ రాజమౌళి, బాలయ్యతో సినిమా తీస్తే కలెక్షన్స్‌కి తిరుగు ఉండదు అంటున్నారు నందమూరి అభిమానులు. నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఆ సినిమా ఉంటుందని నమ్ముతారు ఫ్యాన్స్. ఇక ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Rajamouli Talks about Movie with Balakrishna:

I Tried Movie with Balakrishan says Rajamouli

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ