మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనాతో వాయిదా పడినప్పటికీ... ఆ సినిమా ముచ్చట్లు రోజూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. చిరు, కొరటాల శివ లు ఆచార్య ముచ్చట్లు రోజుకొక్కటి చొప్పున రివీల్ చేస్తే... తాజాగా మెగా డాటర్ నిహారిక ఆచార్య కథలో రామ్ చరణ్ పాత్ర, సినిమా స్టోరీని రివీల్ చేసి షాకిచ్చింది. అసలే చిరు ఆచార్య టైటిల్ ని హడావిడి లేకుండా ప్రకటిస్తే.. ఇప్పుడు ఆచార్య సినిమా పూర్తి కథని నిహారిక బయటపెట్టేసింది.
ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పాత్రని చిరు కన్ఫర్మ్ చేస్తే.. రామ్ చరణ్ పాత్రకి హీరోయిన్ కూడా ఉంటుంది అని కొరటాల క్లూ ఇచ్చాడు. తాజాగా నిహారిక ఆచార్య కథను, ఆ సినిమాలో నిహారిక పాత్రని రివీల్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నక్సలైట్ పాత్రలో ఈ సినిమాలో అతిధి పాత్రచేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మెగా కుమార్తె నిహారికా రామ్ చరణ్ సొదరిగా నటిస్తుంది. ఆచార్య కథ ప్రకారం రామ్ చరణ్ గూండాల చేత చంపబడితే.... ఆ కథని నిహారిక వివరిస్తుంది. అయితే రామ్ చరణ్‌ను చంపే గూండాలపై కోపంతో... కసితో చిరంజీవి వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇది ఆచార్య కథ... ఇక కథ ప్రకారం ట్విస్టులు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయని చెబుతుంది నిహారిక.