Advertisementt

కుకింగ్ ఛాలెంజ్‌: మోహన్ బాబు స్పెషల్ వడ

Tue 28th Apr 2020 06:41 PM
mohan babu,special vada,challegne,pinki reddy,tsr  కుకింగ్ ఛాలెంజ్‌: మోహన్ బాబు స్పెషల్ వడ
Mohan babu finished Cooking Challenge with special Vada కుకింగ్ ఛాలెంజ్‌: మోహన్ బాబు స్పెషల్ వడ
Advertisement
Ads by CJ

స్పెష‌ల్ వ‌డ‌ల‌ను చేసిన క‌లెక్ష‌న్ కింగ్ డాక్ట‌ర్ మోహ‌న్‌బాబు.. డాక్ట‌ర్ టి. సుబ్బ‌రామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డి కుకింగ్ ఛాలెంజ్‌కు స్పంద‌న‌

క‌లెక్ష‌న్ కింగ్‌ డాక్ట‌ర్ ఎం. మోహ‌న్‌బాబు, క‌ళాబంధు టి. సుబ్బ‌రామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డి కుకింగ్ ఛాలెంజ్‌ను స్వీక‌రించి, స్పెష‌ల్ మ‌సాలా వ‌డ‌ల‌ను త‌యారుచేసి చూపించారు. ఈ వంట‌లో ఆయ‌న‌కు మ‌న‌వ‌రాలు విద్యానిర్వాణ మంచు ఆనంద్ సాయం చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ వంట‌కు సంబంధించిన వీడియోను మోహ‌న్‌బాబు విడుద‌ల చేశారు. ‘‘నా ఆత్మీయుడు డాక్ట‌ర్ టి. సుబ్బ‌రామిరెడ్డి గారి కుమార్తె నాకు స‌వాలు విసిరింది, నేను వంట చేసి చూపించాల‌ని. స్పెష‌ల్ వ‌డ‌ల‌ను చేసి చూపిస్తా’’ అని ఆయ‌న వంట చేసి చూపించారు. 

ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర‌ప‌, తెల్ల‌గ‌డ్డ‌, క‌రివేపాకు, కొత్తిమీర‌, శ‌న‌గ‌ప‌ప్పు పిండి మిశ్ర‌మంతో ఆయ‌న వ‌డ‌ల‌ను త‌యారుచేశారు. నూనెలో వేయ‌డానికి త‌న‌కు వ‌డ‌లు చేసి ఇచ్చిన మ‌న‌వ‌రాలిని ‘యు ఆర్ గ్రేట్ గాళ్’ అంటూ మెచ్చుకున్నారు. ప్ర‌స్తుత సంక్షోభ కాలంలో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని పేద‌ల‌కు మోహ‌న్‌బాబు కుటుంబం నిత్యాన్న‌దానం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Click Hero for Mohan Babu Making special Vada Video

Mohan babu finished Cooking Challenge with special Vada:

Mohan babu Makes special Vada for pinki reddy Challege

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ