Advertisementt

తారక్, చరణ్ ల అల్లరి గురించి రాజమౌళి!

Tue 28th Apr 2020 06:38 PM
rajamouli,jr ntr,ram charan,friendship,rrr movie,shooting  తారక్, చరణ్ ల అల్లరి గురించి రాజమౌళి!
Rajamouli Revealed Top Secret About Ntr and Charan తారక్, చరణ్ ల అల్లరి గురించి రాజమౌళి!
Advertisement
Ads by CJ

RRR షూటింగ్ సమయంలో తారక్ అండ్ రామ్ చరణ్ ని కంట్రోల్ మా వల్ల కాలేదు అంటున్నారు రాజమౌళి. ఇద్దరు తెగ అల్లరి చేస్తుంటారని ఒకరిని మించి ఒకరు చేస్తుంటారని చెబుతున్నారు రాజమౌళి. తారక్ తనకు ముందు నుండే తెలుసు కాబట్టి అల్లరి ఎంత చేస్తాడని తెలుసు. కానీ ఈ మధ్య మరి ఎక్కువ అయింది. తారక్ కి జోడిగా చరణ్ దొరకడంతో వీరిద్దరూ అల్లరికి అంతులేకుండా పోయింది. షూటింగ్ స్పాట్ లో వీళ్లను మేనేజ్ చేయడం చాలా కష్టమవుతోందని జక్కన్న చెప్పాడు.

ముందు తారకే... చరణ్ ని కెలుకుతాడని ఆ తరువాత చరణ్ అందుకుంటాడని జక్కన్న చెప్పాడు. సెట్స్ లో ఒకరికి సీరియస్ గా ఏదన్నా చెబుతుంటే మరొకరు కామెడీ చేస్తుంటారని దాంతో నవ్వుకుంటారని.. అలా వీళ్ళని సెట్స్ లో కంట్రోల్ చేయడం కష్టం అవుతుందని చెబుతున్నారు.

బాహుబలి షూటింగ్ అప్పుడు కూడా ప్రభాస్ అండ్ రానా అల్లరి చేసేవాళ్లని కానీ మరి ఇంత కాదని పాపం వాళ్లకి ఎక్కువ అల్లరి చేయడానికి అవకాశం లేకపోయిందని జక్కన్న వెల్లడించాడు. భారీ కాస్ట్యూమ్స్, మేకప్‌తో ముడిపడిన సినిమా కావడంతో అల్లరి చేయడానికి అంత ఆస్కారం ఉండేది కాదని... కానీ షూటింగ్ ముగిశాక మాత్రం ప్రభాస్, రానాను ఎక్కువగా కెలుకుతూ ఉండేవాడని ఆయన తెలిపాడు.

Rajamouli Revealed Top Secret About Ntr and Charan:

Rajamouli Talks About Jr Ntr and Ram Charan Friendship

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ