Advertisementt

ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన బోయపాటి

Tue 28th Apr 2020 04:28 PM
boyapati srinu,balakrishna,rumours,clarity,movie  ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన బోయపాటి
Balakrishna and Boyapati Movie Latest Update ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన బోయపాటి
Advertisement
Ads by CJ

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకే పండగ కాదు డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా పండగే. ఎందుకంటే ఈ కాంబినేషన్ లో సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. అలానే గతంలో వచ్చిన సింహా, లెజెండ్ ఇద్దరి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు భారీ వసూళ్లు చేసాయి. దాంతో మూడోసారి జత కడుతున్న వీరిద్దరూ ఎటువంటి సినిమా తీయబోతున్నారో అని ఆసక్తి నెలకొంది. ఇందులో బాలయ్య అఘోరా తరహా పాత్ర చేస్తున్నాడని.. అందుకోసమే గుండు కొట్టించుకున్నాడని ఒక రూమర్ హల్ చల్ చేసింది. అలానే ఈమూవీ ఓ పొలిటికల్ డ్రామా అని వార్తలు బయటకు వస్తున్నాయి.

ఇక ఈ రూమర్స్ పై బోయపాటి లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. బాలయ్యతో చేస్తున్న కొత్త సినిమా పొలిటికల్ డ్రామా కాదని బోయపాటి తేల్చేశాడు. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కానీ ఇందులో సరిపడా యాక్షన్ కూడా ఉంటుందని చెప్పాడు. ఇక బాలయ్య అఘోరా పాత్ర గురించి అడిగితే.. దానికి ఇండైరెక్ట్ గా సమాధానం ఇచ్చాడు. వారణాసిలో ఒక కీలకమైన ఎపిసోడ్ ఉంటుందని, అందులో బాలయ్య గెటప్, ఆయన నటన ఆశ్చర్యానికి గురి చేస్తాయని ఇండైరెక్ట్ గా చెప్పాడు బోయపాటి. ఇక ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ని ఫైనల్ చేశామని, కానీ లాక్ డౌన్ కారణంగా వారి డేట్స్ విషయంలో తేడా వచ్చే అవకాశముందని దాంతో లాక్ డౌన్ తరువాత వారి గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశముందని చెప్పాడు.

ఈ సినిమా గురించి లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో బాలయ్యకు అసిస్టెంట్ గా ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా హిట్ ఎంట్రీ ఇచ్చిన ‘నవీన్‌ పొలిశెట్టి’ నటించబోతున్నాడని తెలుస్తుంది.

Balakrishna and Boyapati Movie Latest Update:

Boyapati Clarity on Rumours

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ