Advertisementt

త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఫిల్మ్ లో యంగ్ హీరో

Tue 28th Apr 2020 12:24 PM
trivikram srinivas,ntr,new movie,young hero,sentiment  త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఫిల్మ్ లో యంగ్ హీరో
Young Hero in Trivikram and NTR Film త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఫిల్మ్ లో యంగ్ హీరో
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తర్వాత పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ తో సినిమాని ఓకే చేసుకున్నాడు. మరి ఎన్టీఆర్ తో పాన్ ఇండియా ఫిల్మ్ లేదా సౌత్ కే పరిమితం చేస్తాడా అనేది క్లారిటీ లేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఓల్డ్ ఫార్ములానే ఫాలో కాబోతున్నాడని టాక్ వినబడుతుంది. త్రివిక్రమ్ ఈ మధ్యన వరసగా తన సినిమాల్లోకి స్టార్ హీరోలతో పాటుగా యంగ్ హీరోలకు మంచి రోల్స్ రాస్తున్నాడు. అజ్ఞాతవాసిలో ఆది పినిశెట్టిని, స్టైలిష్ విలన్ ని చేసిన త్రివిక్రమ్, అరవింద సమేతలో నవీన్ చంద్రని విలన్ ని చేసాడు.

ఇక అల వైకుంఠపురములో సుశాంత్ ని, అల్లు అర్జున్ కి ఆపోజిట్ గా చూపించాడు. మరి యంగ్ హీరోలకు మంచి రోల్స్ రాసుకొస్తున్న త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం కూడా ఓ యంగ్ అందులోను, కాస్త క్రేజ్ ఉన్న హీరోని తీసుకోబోతున్నాడనే టాక్ వినబడుతుంది. అయితే ఆ యంగ్ హీరోని నెగెటివ్ గానా, లేదా సపోర్టింగ్ రోల్ కి తీసుకోబోతున్నాడో తెలియదు కానీ.. ఓ పాపులర్ యంగ్ హీరో మాత్రం ఎన్టీఆర్ మూవీలో పక్కా అంటున్నారు. అయితే ఇప్పటివరకు ఏ హీరోని ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ సంప్రదించలేదని కరోనా లాక్ డౌన్ ముగియగానే ఆ పనిలో త్రివిక్రమ్ బిజీ అవుతాడని అంటున్నారు. మరి ప్రస్తుతం ఎన్టీఆర్ స్క్రిప్ట్ మీద త్రివిక్రమ్ ఫుల్ బిజీ అట.

Young Hero in Trivikram and NTR Film:

Sentiment Continues to Trivikram Next Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ