అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ఇది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. పూర్తి మాస్ లుక్ లో బన్నీ లుక్ అదిరిపోయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న కనిపిస్తుంది.
అయితే పుష్పలో రష్మికతో పాటు మరో హీరోయిన్ కూడా ఉందని వార్తలు వచ్చాయి. సెకండ్ హీరోయిన్ గా నివేధా థామస్ కి అవకాశం వచ్చిందని అన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పుష్పలో సెక్ండ్ హీరోయిన్ లేదంట. సుకుమార్ రాసుకున్న స్క్రిప్టు ప్రకారం సెకండ్ హీరోయిన్ కి ఛాన్సే లేదంట. సెకండ్ హీరోయిన్ పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని, వాటిని నమ్మవద్దని చిత్ర బృందం కోరింది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.