Advertisementt

హిందీలోనూ అదే తరహా ప్రయత్నం.. వర్కౌట్ అయ్యేలా ఉంది..

Mon 27th Apr 2020 01:36 PM
ismart shankar,puri jagannadh,ram pothineni,ranbeer kapoor  హిందీలోనూ అదే తరహా ప్రయత్నం.. వర్కౌట్ అయ్యేలా ఉంది..
Ismart Shankar Hindi remake..? హిందీలోనూ అదే తరహా ప్రయత్నం.. వర్కౌట్ అయ్యేలా ఉంది..
Advertisement
Ads by CJ

తెలుగు సినిమాలకి హిందీలో మంచి గిరాకీ ఏర్పడింది. ఇక్కడి సినిమాలకి హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో వదిలితే మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. హిందీ ఆడియన్స్ తెలుగు సినిమాలకి ఇస్తున్న ఆదరణ చూసిన అక్కడి నిర్మాతలు తెలుగు సినిమాలని హిందీలో రీమేక్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ కి వెళ్లాయి. తాజాగా మరో హిట్ చిత్రం హిందీ రీమేక్ కి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న దర్శకుడు పూరి జగన్నాథ్ కి ఇస్మార్ట్ శంకర్ రూపంలో సాలిడ్ హిట్ పడింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయనున్నారట. ఈ రీమేక్ లో బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ నటిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇస్మార్ట్ శంకర్ పూర్తి మాస్ చిత్రం. రణ్ బీర్ కపూరేమో చాక్లెట్ బాయ్ తరహా సినిమాలే చేశాడు. అతని లుక్స్ కూడా అలాగే ఉంటాయి.

మరి అంతటి మాస్ రోల్ లో చాక్లెట్ బాయ్ గా కనిపించే రణ్ బీర్ కపూర్ ఏమాత్రం సెట్ అవుతాడని అంటున్నారు. అయితే దీనికి పెద్దగా ఆలోచించాల్సిన లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ముందు రామ్ కూడా చాక్లెట్ బాయ్ పాత్రలే చేశాడు. పూరి జగన్నాథ్ తో సినిమా అనగానే అందరూ షాక్ అయ్యారు. కానీ ఇస్మార్ట్ శంకర్ రామ్ పర్ ఫార్మెన్స్ చూశాక, ప్రతీ ఒక్కరూ ఫిదా అయిపోయారు.

మాస్ లుక్ లో రామ్ కనిపించిన తీరు, పలికిన డైలాగులు, చేసిన డాన్సులు అన్నీ హైలైట్ గా నిలిచాయి. కాబట్టి దర్శకుడు సరిగ్గా డీల్ చేయగలిగితే రణ్ బీర్ కపూర్ కి బాగా సెట్ అవుతుందని అంటున్నారు. మరి పూరి జగన్నాథ్ లా హీరో లుక్స్ మార్చే దర్శకుడు ఎవరో..

Ismart Shankar Hindi remake..?:

Ismart Shankar Hindi remake..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ