లాక్డౌన్ కారణంగా సెలెబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కోపనిలో బిజీగా ఉన్నారు. చాలా మంది సెలెబ్రిటీలు ఈ లాక్డౌన్ ని బాగా ఉపయోగించుకుంటూ, కొత్త కొత్త కోర్సులని నేర్చుకుంటున్నారు. తమ అభిరుచులకి మరింత పదునుపెడుతున్నారు. అయితే డైరెక్టర్ తేజ్ వైరస్ ని చదువుతున్నాడట. ప్రపంచ ఆరోగ్య సంస్థ వైరస్ లపై అందిస్తున్న ఆన్ లైన్ కోర్సులో తాను కూడా చేరాడట.
ఈ కోర్సులో వైరస్ ల గురించి పూర్తి అధ్యయనం ఉంటుందిట. వైరస్ ల లక్షణాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా మరెన్నో రకాల ఆసక్తికరమైన అంశాలు ఉంటాయట. ఈ కోర్సు పూర్తి చేసిన అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక టెస్ట్ పెడుతుందట. ఈ టెస్ట్ లో పాస్ అయితే సర్టిఫికేట్ ని కూడా అందజేస్తారట. వైరస్ లు మహమ్మారిగా మారినపుడు ఇలా కోర్సు తీసుకున్న వారిని వాలంటీర్ గా తీసుకుంటారట.