Advertisementt

రేపు 9గంటలకి మెగాస్టార్ ఏదో చెప్పబోతున్నాడు..

Mon 27th Apr 2020 12:10 PM
megastar chiranjeevi,lockdown celebroties,ccc,covid19,coronavirus   రేపు 9గంటలకి మెగాస్టార్ ఏదో చెప్పబోతున్నాడు..
Megastar wants to share something.. రేపు 9గంటలకి మెగాస్టార్ ఏదో చెప్పబోతున్నాడు..
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా అకౌంట్ స్టార్ట్ చేసినప్పటి నుండి చాలా హుషారుగా ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్లతో ట్విట్టర్ అభిమానులకి ఆనందం పంచుతున్నారు. పాత విషయాలని గుర్తుచేస్తూ, కొత్తవాటి గురించి చెబుతూ ఫుల్ అప్డేట్ లో ఉంటున్నారు. మొన్నటికి మొన్న బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజిని స్వీకరించి అమ్మగారికి దోశ చేసి, ఆ వీడియోని మనతో షేర్ చేసుకున్నారు. ఈ విధంగా ప్రతీ రోజూ ఏదో ఒక్క కొత్త విశేషంతో సొషల్ మీడియాని ఆసక్తిగా మార్చేస్తున్నారు.

అయితే తాజాగా చిరంజివి మనకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు. దానికి సంబంధించి ఈ విధంగా ట్వీట్ పెట్టాడు. నేను సాధారణంగా సాంగ్ షూట్ జరుగుతున్నప్పుడే ఆ సాంగ్స్ ని పూర్తిగా వింటూ ఆస్వాదిస్తాను. మధ్యలో కొంచెం పాజ్ చేయడం అలవాటు లేదు. కానీ ఈ మధ్య ఒక పాటని మధ్యలో పాజ్ చేస్తూ, మళ్ళీ మళ్ళీ వింటూ చాలా ఎంజాయ్ చేసాను. ఇంతకీ ఆ పాటేంటో, అలా మధ్యలో పాజ్ చేసినా ఎంజాయ్ చేయడానికి కారణం ఏంటో రేపు ఉదయం 9గంటలకి చెబుతానని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. మరి మెగాస్టార్ ని ఉర్రూతలూగించిన ఆ పాట ఏంటి.. దానికి కారణం ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తి నెటిజన్లలో బాగా ఎక్కువైంది.

Megastar wants to share something..:

Megastar wants to share something

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ