Advertisementt

పవన్ క్రిష్ సినిమాలో తమిళ హీరో..?

Mon 27th Apr 2020 11:47 AM
pawan kalyan,krish,shiva karthikeyan  పవన్ క్రిష్ సినిమాలో తమిళ హీరో..?
Tamil hero in Pawn Krish combo..? పవన్ క్రిష్ సినిమాలో తమిళ హీరో..?
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా మూడు సినిమాలని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మూవీ పింక్, తెలుగు రీమేక్ వకీల్ సాబ్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాతి చిత్రంగా గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వకీల్ సాబ్ చిత్రీకరణ దాదాపు పూర్తికావొచ్చింది. ఇక క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమా గురించి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మొఘలుల కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో రిలీజవుతున్న మొదటి పాన్ ఇండియా చిత్రం. ఇందులో పవన్ ఓ బందిపోటు దొంగగా కనిపిస్తున్నాడట. అయితే ఈ సినిమాకి పాన్ ఇండియా  అప్పీల్ తీసుకురావడానికి బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారు. అయితే హీరోయిన్ నే కాకుండా మరి కొన్ని కీలకమైన పాత్రల్లో వేరే భాషల నుండి నటీనటులని తీసుకుంటున్నారట.

ఈ నేపథ్యంలో తమిళంలో పాపులర్ హీరో అయిన శివ కార్తికేయన్ ని ఒకానొక పాత్ర కోసం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. శివ కార్తికేయన్ కి తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. అతన్ని తీసుకుంటే తమిళ మార్కెట్ కి ఎలాంటి ఢోకా లేనట్టే. ఈ విషయమై అధికారిక సమాచారం రానప్పటికీ శివ కార్తికేయన్ ని తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారట.

Tamil hero in Pawn Krish combo..?:

Shiva karthikeyan playing a role in Pawan Krish combo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ