పవన్ కళ్యాణ్ రాజకీయాలకి కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చి వరస సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ప్రస్తుతం పవన్ పింక్ రీమేక్ చేస్తుండగా మరో వైపు క్రిష్ తో చేయడానికి రెడీ అయ్యాడు. క్రిష్ - పవన్ కాంబినేషన్ అంటే అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే కథ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. స్టోరీ దాదాపు కంప్లీట్ అయిపోవడం విరూపాక్ష అనే టైటిల్ పెట్టబోతున్నారు అని తెలుస్తుంది. ఇది మొఘలాయిల కాలం నాటి కథ. ఓ వజ్రం చుట్టూ తిరుగుతుంది. అప్పటి కాలమాన పరిస్థితుల్ని జోడిస్తూ.. ఓ దొంగ కథ చెప్పబోతున్నారు.
ఇది హిస్టారికల్ కథ అయినప్పటికీ పొలిటికల్ సెటైర్ అని కూడా సమాచారం అందుతోంది. తుగ్లక్‌కి సంబంధించిన ఓ ఎసిసోడ్ ఈ కథలో ఉంది. ఆ ఎపిసోడ్‌ని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సెటైర్‌గా వాడుకుంటున్నారని తెలుస్తోంది. పైగా డైరెక్టర్ క్రిష్ కి కూడా పొలిటికల్ అవగాహన ఎక్కువే. మరి ఆ పొలిటికల్ సెటైర్ ఎవరి మీదో అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి ఉండాలి.