హైపర్ ఆది అందగాడు కాదు.. కానీ ఆదికి చాలా టాలెంట్ ఉంది. జబర్దస్త్ లో హైపర్ ఆది వేసే పంచ్ లు మాములుగా ఉండవు. ఆది స్కిట్ వచ్చింది అంటే చాలు... పగలబడి నవ్వాల్సిందే, జబర్దస్త్ లోనే కాదు.. ఆది ఢీ డాన్స్ షోలోను టీం లీడర్ గా పంచ్ లతో అదరగొట్టేసాడు. అయితే జబర్దస్త్ లో సుధీర్ - రష్మీ ఫేమస్ అయినట్లుగా.. ఢీ డాన్స్ షోలో ఆది - వర్షిణి జంట అంత ఫేమస్ అవుతుంది. అసలు వర్షిణి - ఆది లవ్ లో ఉన్నారని వారు పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం ఉంది.
అయితే ఆదిపై వస్తున్న రూమర్స్ కి తాజాగా ఆది చెప్పిన పెళ్లి విషయాలతో ఫుల్ స్టాప్ పడినట్లే. ఎందుకంటే హైపర్ ఆదికి పెళ్లి కుదిరింది. టీవీ, సినిమా నేపథ్యం ఉన్న ఎవరిని తానూ పెళ్ళాడనని, తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్పిన ఆది.. చెప్పినట్టుగానే తల్లిదండ్రులు చూపించిన సంబంధమే చేసుకుంటున్నాడు. ఆది నెల్లూరు జిల్లా. దాని పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా అమ్మాయిని తల్లిదండ్రులు ఆది కోసం చూశారట. ఆదికి కూడా అమ్మాయి నచ్చి ఆ అమ్మాయితో వచ్చే ఏడాది తన పెళ్లి ఉండొచ్చని ఆది తాజాగా చెబుతున్న మాట.