Advertisementt

అలాంటి పాత్రలొస్తే ఖచ్చితంగా చేస్తా.. ఉపేంద్ర

Sun 26th Apr 2020 02:22 PM
upendra,allu arjun,sandalwood,trivikram   అలాంటి పాత్రలొస్తే ఖచ్చితంగా చేస్తా.. ఉపేంద్ర
I dont want to do villain roles అలాంటి పాత్రలొస్తే ఖచ్చితంగా చేస్తా.. ఉపేంద్ర
Advertisement
Ads by CJ

కన్నడ స్టార్ ఉపేంద్ర మన తెలుగు వారికి కూడా పరిచయమే. కన్నడలో బిజీగా ఉన్నప్పటికీ ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు. కన్యాదానం, రా, ఉపేంద్ర వంటి సినిమాల ద్వారా ఇక్కడ కూడా మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. ఉపేంద్ర సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి. అందుకే జనాలకి ఉపేంద్ర సినిమా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఉపేంద్ర చివరగా తెలుగులో కనిపించింది అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తిలోనే.

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉపేంద్ర పాత్ర చాలా బాగుంటుంది. ఆ పాత్రని ఉపేంద్ర కంటే ఎవరూ బాగా చేయలేరేమో అన్నంత బాగా చేశాడు. అయితే ఈ సినిమా తర్వాత ఉపేంద్రకి తెలుగులో అవకాశాలు బాగానే వచ్చాయట. కానీ కన్నడ సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాడట. అదీగాక ఉపేంద్రని విలన్ గా నటింపజేయడానికే దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారట. అందువల్ల అన్నీ విలన్ పాత్రలే తన దగ్గరకు వస్తున్నాయట.

అయితే సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో లాగా డిఫరెంట్ గా ఉండే పాత్రలు తన వద్దకి వస్తే ఖచ్చితంగా తెలుగులో మళ్ళీ కనిపిస్తానని చెబుతున్నాడు. మరి ఉపేంద్రని తమ సినిమాలో నటింపజేయాలని అనుకునేవారు విలన్ పాత్రలు కాకుండా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసుకోండి.

I dont want to do villain roles:

I dont want to do villain roles in Telugu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ