Advertisementt

ర‌వితేజ ‘క్రాక్’లో క‌టారిగా స‌ముద్ర‌ఖని

Mon 27th Apr 2020 09:08 AM
samuthirakani,krack movie,raviteja,gopichand malineni,birthday special  ర‌వితేజ ‘క్రాక్’లో క‌టారిగా స‌ముద్ర‌ఖని
Samuthirakani Look from Krack Movie ర‌వితేజ ‘క్రాక్’లో క‌టారిగా స‌ముద్ర‌ఖని
Advertisement
Ads by CJ

ర‌వితేజ ‘క్రాక్’ సినిమాలో క‌టారిగా స‌ముద్ర‌ఖని ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘క్రాక్‌’. ఈ సినిమా నిర్మాణ ప‌నులు ముగింపు ద‌శ‌లో ఉన్నాయి. చివ‌రి షెడ్యూల్ మిన‌హా మిగ‌తా షూటింగ్ అంతా పూర్త‌వ‌గా, లాక్‌డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత ఆ షెడ్యూల్ జ‌ర‌గ‌నున్న‌ది.

ఏప్రిల్ 26 త‌మిళ న‌టుడు స‌ముద్ర‌ఖని పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ‘క్రాక్’ చిత్రంలో ఆయ‌న పోషిస్తోన్న క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. పోస్ట‌ర్‌లో చూపించిన విధంగా క‌టారి అనే ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో ఇంటెన్స్ లుక్‌లో స‌ముద్ర‌ఖని క‌నిపించ‌నున్నారు.

ఈ సినిమాతో శ్రుతి హాస‌న్ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఒక నెగ‌టివ్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. స‌ర‌స్వ‌తీ ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా జి.కె. విష్ణు ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:

ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌, స‌ముద్ర‌ఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, ర‌విశంక‌ర్‌, దేవీ ప్ర‌సాద్‌, చిర‌గ్ జాని, మౌర్య‌ని, ‘హ్య‌పీ డేస్’ సుధాక‌ర్‌, వంశీ చాగంటి త‌దిత‌రులు

సాంకేతిక బృందం:

డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా

పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి

సంగీతం: ఎస్‌. ఎస్. త‌మ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ: జి.కె. విష్ణు

ఎడిటింగ్‌: న‌వీన్ నూలి

ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్ర‌కాష్‌

ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌

పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌

స‌హ నిర్మాత‌: అమ్మిరాజు కానుమిల్లి

నిర్మాత‌: బి. మ‌ధు

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని

బ్యాన‌ర్‌: స‌ర‌స్వ‌తీ ఫిలిమ్స్ డివిజ‌న్‌

Samuthirakani Look from Krack Movie:

Samuthirakani’s First Look As Katari In Ravi Teja’s Krack Unveiled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ